రజనీకాంత్ “సిల్క్ స్మిత” ని ప్రేమించారా..? వీరి లవ్ స్టోరీ గురించి తెలుసా..?

Ads

ఎన్నో సినిమాల్లో నటించి, తను లేకపోయినా కూడా ఇప్పటికీ కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన నటి సిల్క్ స్మిత. అప్పట్లో సినిమాలు అన్నప్పుడు అందులో హీరోయిన్స్ ఇలాగే ఉండాలి అని ఒక నియమం ఉండేది.

హీరోయిన్స్ మాత్రమే కాకుండా, సినిమాల్లో నటించేవారు, అందులోనూ ముఖ్యంగా ఆడవారు ఎలా కనిపించాలి అనే విషయం గురించి కొన్ని రూల్స్ ఉండేవి. వాటన్నిటినీ కూడా సిల్క్ స్మిత బ్రేక్ చేశారు. స్పెషల్ సాంగ్స్ అంటే తన పేరే గుర్తుకు వచ్చే అంత పాపులర్ అయ్యారు.

సిల్క్ స్మిత తెలుగు వారు అయినా కూడా మిగిలిన భాషల్లో కూడా నటించారు. సిల్క్ స్మిత జీవితం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంది. ఆవిడ మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేది ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. సిల్క్ స్మిత సినిమాల్లో సక్సెస్ పొందినా కూడా వ్యక్తిగతంగా ఎన్నో సంఘటనలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పెళ్లి, ప్రేమ విషయాల్లో సిల్క్ స్మిత ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఒక ప్రముఖ హీరోతో సిల్క్ స్మిత రిలేషన్ లో ఉన్నారు అనే వార్త కూడా వచ్చింది.

rajinikanth silk smitha story

Ads

ఆయన రజనీకాంత్. సిల్క్ స్మిత, రజనీకాంత్ హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో స్పెషల్ పాటల్లో నటించారు. మూండ్రు ముగం, పాయుం పులి, రంగా, తంగ మగన్ ఇలా చాలా సినిమాల్లో వీళ్ళు కలిసి నటించారు. దాంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది అని అప్పట్లో చాలా చర్చించుకునేవారు. అంతే కాకుండా, సాక్షి కథనం ప్రకారం, సిల్క్ స్మిత మీద రజనీకాంత్ సిగరెట్ తో కాల్చినట్టు కొన్ని పుకార్లు కూడా వచ్చాయట.

ఈ విషయం గురించి సినిమా సెట్స్ లో కూడా మాట్లాడుకునేవారు. కొంత మంది మాత్రం, “వీరిద్దరి మధ్య ఏదో ఉంది” అని అంటే, మరి కొంత మంది మాత్రం, “అలాంటిది ఏమీ లేదు అని, కేవలం వారు కలిసి నటించినందువల్లనే ఇలాంటి పుకార్లు వచ్చాయి” అని అన్నారు. ఏదైనా సరే, అప్పట్లో సోషల్ మీడియా లాంటివి ఏవీ లేవు కాబట్టి ఈ విషయాల గురించి స్పష్టత ఎక్కువగా ఉండేది కాదు.

ALSO READ : 1965 లో హోటల్ లో టిఫిన్స్ ధరలు ఎంతో తెలుసా.? అప్పటి ఈ బిల్ ఒక లుక్ వేయండి.!

Previous articleపక్క రాష్ట్రాల హీరోలతో సినిమాలు చేసి… ప్లాప్స్ ఇచ్చిన 10 మంది దర్శకులు వీళ్ళే..!
Next articleఇండస్ట్రీలో యాభై ఏళ్ల నుండి వుంటున్న.. 17 మంది నటులు వీళ్ళే..!