Ads
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ చిత్రాలతో సందడి చేసిన రజినీకాంత్ గత కొద్ది కాలంగా సరైన ఫలితాలు లేక తటపట ఇస్తున్నారు. అతనిపై భారీగా నమ్మకం పెట్టిన నిర్మాతలు కూడా నామమాత్రం లాభాలతో సరిపెట్టుకునేవారు. మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ కి జైలర్ సినిమా ఒక కం బ్యాక్ చిత్రంగా మారింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న థియేటర్లలో వరల్డ్ వైడ్ విడుదలయి అదరగొట్టే కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
ఇటీవలే ఈ సినిమా ఓటిటిలో కూడా విడుదల అయ్యింది. ఓటిటిలో కూడా ఈ సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాలో రజినీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించగా, కొడుకు పాత్రలో యంగ్ హీరో వసంత్ రవి నటించారు. అయితే రజినీకాంత్ కోడలిగా నటించిన అమ్మాయి ఎవరా అని కూడా నెటిజెన్స్ తెగ వెతికేస్తున్నారు అంట. ఆమె ఎవరో? ఆమె బాక్గ్రౌండ్ ఏంటో చూడండి..
#1.
జైలర్ లో రజినీకాంత్ కోడలి పాత్రలో కనిపించిన నటి కూడా హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు. ఇతర భాషల్లో కాదు.. మన తెలుగు సినిమాల్లోనే ఆమె హీరోయిన్ గా చేసింది. టాలీవుడ్ లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘క్రేజీ ఫెలో’, అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన ‘ఉగ్రం’లో కూడా హీరోయిన్‍గా నటించింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆమె అసలు పేరు అదితి. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత మిర్నా మేనన్‌గా మారింది.
మిర్నా మేనన్ కేరళలో ఇడుక్కిలో జన్మించింది. ఇండస్ట్రీకి రాకముందు ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసింది. ఆ తరువాత ఆమె ఫొటోలని చూసి ఒక దర్శకుడు తన మూవీలో అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా 2016లో ‘పట్టదారి’ అనే సినిమాలో నటించింది. ఆ తరువాత ‘కలవని మప్పిలై’ అనే సినిమాలో నటించింది. కోలీవుడ్ లో రెండు చిత్రాలు చేసిన తరువాత మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘బిగ్ బ్రదర్’ మూవీలో నటించింది. అలా ఆమెకు గుర్తింపు వచ్చింది.
#2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
watch video:
Ads