Ads
ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్లో అప్పటివరకు విమర్శిస్తున్న అందరి నోర్లు ముగించడమే కాకుండా అదరగొట్టే పర్ఫామెన్స్ చూపించింది టీం ఇండియా. దీంతో ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించబడుతున్న ఈ టోర్నీలో ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.
ఇక లీగ్ దశలో నెక్స్ట్ ఇండియా తలపడబోయేది బాంగ్లాదేశ్ తోటి.. ఈ నేపథ్యంలో తుది జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నామమాత్రంగా జరగబోయే ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ స్టార్ బాటర్ విరాట్ కోహ్లీ తో పాటు మెయిన్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వడానికి టీం మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం కీలక ఆటగాళ్లకు కాస్త విశ్రాంతి ఇవ్వడంతో పాటు మిగిలిన ప్లేయర్స్ ఏ రేంజ్ లో ఆడుతారు పరీక్షించడానికి అని తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం పై క్రికెట్ విశ్లేషకులు భిన్న అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు.
Ads
మూడు రోజులు తగినంత విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడడంతో ప్రస్తుతం టీం పై ఒత్తిడి బాగానే ఉంది. ముఖ్యంగా ఓపెన్ అయిన రోహిత్ శర్మ…. కెప్టెన్ గా కూడా అదనపు భారాన్ని మోస్తున్నాడు. మరోపక్క స్టార్ బ్యాటర్ కోహ్లీ లంక మ్యాచ్ కు ముందు తన 15 ఏళ్ల కెరియర్ లో ఇలా వెంట వెంటనే వన్డేలు ఆడడం ఇదే మొదటిసారి అని అన్నారు. అంటే ఇన్ డైరెక్ట్ గా తన వయసు గుర్తు చేస్తూ కాస్త శరీరానికి విశ్రాంతి అవసరం అని చెప్పడమే కదా.
ఫైనల్ కు చేరిన భారత్ టైటిల్కు అడుగు దూరంలోనే ఉంది కాబట్టి ఇటువంటి సమయంలో నామమాత్రపు మ్యాచ్లో కాస్త స్టార్ ప్లేయర్స్ కు విశ్రాంతి ఇవ్వడం తప్పేమీ కాదు. రోహిత్ శర్మకు కూడా విశ్రాంతి ఇస్తే టీం పగ్గాలు హార్దిక్ పాండ్యా చేతుల్లోకి వెళ్తాయి. మరోపక్క బరిలోకి సూర్యకుమార్ ని దించే ఆస్కారం ఉంది. బుమ్రా ప్లేస్ లో మహమ్మద్ షమీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.