“అనంత్ అంబానీ” ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా..? దీనిలో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయా..?

Ads

అంబానీ కుటుంబ వారసుడిగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టినా కూడా, తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని, ఇప్పుడు మరొక గొప్ప వ్యాపారవేత్తగా ఎదుగుతున్నారు అనంత్ అంబానీ. అనంత్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్ ని పెళ్లి చేసుకోబోతున్నారు.

వీరిద్దరూ గత ఏడు సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు. గత సంవత్సరం వీరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు పెళ్లికి ముందు మూడు రోజులపాటు సెలబ్రేషన్స్ జరిగాయి. గుజరాత్ లోని జాంనగర్ లో జరిగిన ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గుర్తింపు పొందిన సెలబ్రిటీలు హాజరు అయ్యారు.

అంబానీలు అంటేనే ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబాల్లో ఒకరు. వారి లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. అందుకే వారు వాడే చిన్న చిన్న వస్తువులు కూడా వారి లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా ఖరీదు ఉంటాయి. అయితే, అనంత్ అంబానీ వాచ్ ని చూసి, మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య మెచ్చుకున్నారు. దాంతో ఇప్పుడు ఆ గడియారం ఖరీదు ఎంత అని వెతకడం మొదలుపెట్టారు.

Ads

anant ambani watch cost

ఈ వాచ్ రిచర్డ్ మిల్లె బ్రాండ్ వారు రూపొందించారు. ఇది ఒక స్విస్ వాచ్. దీని ఖరీదు 2 మిలియన్ డాలర్లు. అంటే, ఇండియన్ కరెన్సీలో దాదాపు 16.50 కోట్ల ఖరీదు ఉంటుంది. ఈ వాచ్ లో రత్నాలు, వజ్రాలు, ఎమరాల్డ్స్ అంటే పచ్చలు వంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా విలువైనవి. ఇలాంటి ఖరీదైన వాటితో పొదిగి ఆ వాచ్ డయల్ తయారు చేశారు. అందుకే దీని ఖరీదు అంత ఎక్కువగా ఉంటుంది. ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఈ వాచ్ లని వాడతారు.

why did anant ambani gain weight

అయితే, అనంత్ అంబానీకి కార్లు అంటే కూడా చాలా ఇష్టం. తన దగ్గర ఇప్పటికీ రోల్స్ రాయిస్ ఫాంటమ్, BMW i8, SUV మెర్సిడెస్ బెంజ్ G63 AMG, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లతో పాటు ఇంకా ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇటీవల పెళ్లికి ముందు జరిగిన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా అనంత్ అంబానీ ధరించిన దుస్తులు, వాడిన వస్తువుల ఖరీదు కూడా కోట్లల్లోనే ఉంటుంది.

ALSO READ : బాలయ్య కూతుర్లు హీరోయిన్లుగా అవ్వకపోవడానికి కారణం ఇదేనా.?

Previous article“ఫ్యామిలీ స్టార్” పోస్టర్‌పై కౌంటర్ వేసిన నెటిజన్ కి… “విజయ్ దేవరకొండ” రిప్లై చూస్తే నవ్వాపుకోలేరు..!
Next article“రామ్ చరణ్” ఇప్పటి వరకు సంపాదించిన మొత్తం ఎంత..? ఒక్క సినిమాకి ఎంత తీసుకుంటారు అంటే..?