Ads
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను ఊర మాస్ కాంబో లో తెరకెక్కిన చిత్రం స్కంద. ఇది నామ్ కెరియర్లో మొదటి పాన్ ఇండియన్ చిత్రం కావడంతో అతని అభిమానులు ఈ మూవీ సక్సెస్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ నుంచి టీజర్ వరకు కంప్లీట్ బ్యాక్ టు బ్యాక్ మాస్ క్యారెక్టర్‌లో రామ్ ను ఎలివేట్ చేసి మూవీ పై అంచనాలు భారీగానే పెంచింది. ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు మంచి సాలిడ్ మాస్ యాంగిల్ లో ఈరోజు వరల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.
- నటీనటులు: రామ్,శ్రీలీల,ప్రిన్స్ సిసిల్, శ్రీకాంత్,పృథ్వీ రాజ్,గౌతమి,
ఇంద్రజ,మురళీ శర్మ - దర్శకత్వం,రచన: బోయపాటి శ్రీను
- సంగీతం: తమన్
- మాటలు: ఎం. రత్నం
- నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
- నిర్మాణ సంస్థలు: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్
- విడుదల తేదీ: 28 సెప్టెంబర్ 2023
స్టోరీ:
బోయపాటి శ్రీను మూవీస్ అంటే స్టోరీ లో మాస్ యాక్షన్, ఎలివేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక టిపికల్ మాస్ మసాలా కమర్షియల్ మూవీ లాగా కాకుండా మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా కూడా ఈ చిత్రం తెరకెక్కించడం జరిగింది. ఒక కారు సీన్ తో మొదలయ్యే ఈ సినిమా స్టార్టింగే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
కథ విషయానికి వస్తే ఒక పెద్ద బిజినెస్ మాగ్నెట్ ( శ్రీకాంత్), కొందరు వ్యక్తుల వల్ల అనుకోకుండా సమస్యలు ఎదుర్కొంటాడు . అతనితో పాటు అతని కుటుంబం కూడా చిక్కుల్లో పడుతుంది. పైగా వీళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరోక్షంగా చీఫ్ మినిస్టర్ కారణం కావడంతో ప్రభుత్వం పరంగా కూడా వీళ్లకు ఎటువంటి అండ దండా లభించదు.అయితే ఇలా ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు? ఇంతకీ వీళ్లకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తులు ఎవరు? రామ్ కు వీళ్లకు మధ్య అనుబంధం ఏమిటి? తెలియాలి అంటే సినిమా చూడాలి.
Ads
విశ్లేషణ:
గత కొద్దికాలంగా వరుస సినిమాలు తీస్తున్నప్పటికీ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ కు ఈ మూవీ మంచి హిట్ అందించే అవకాశం ఉందో లేదో చూడాలి…సినిమా మాస్ పరంగా ,యాక్షన్ పరంగా బాగున్నప్పటికీ స్టోరీ చాలా రెగ్యులర్ గానే ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో బోయపాటి మార్క్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇక తమన్ మ్యూజిక్ థియేటర్ దద్దరిల్లుతోంది.
ఇక సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ డోస్ కాస్త ఎక్కువైంది. పర్ఫామెన్స్ పరంగా వస్తే ఈ సినిమాలో రామ్ తన వైపు నుంచి ఎంతో కృషి కనబరిచారు. డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి డాన్స్ స్టెప్స్ వరకు రామ్ తనని తాను ఎంత మార్చుకున్నారో ఈ చిత్రంలో తెలుస్తుంది. శ్రీ లీల పేరుకే హీరోయిన్ కానీ మూవీలో చెప్పుకోదగ్గ పాత్ర ఏమీ లేదు.
ప్లస్ పాయింట్స్:
- ఈ మూవీ టైటిల్ కార్డు టైమ్ లో బీజీఎం ఓ రేంజ్ లో ఉంది.
- చాలా రోజుల తర్వాత తమను తిరిగి డ్యూటీ ఎక్కినట్లు కనిపిస్తోంది.
- మెయిన్ గా రామ్ మాస్ ఎంట్రీ చాలా ఎక్సలెంట్ గా ఉంది.
- సెంటిమెంటల్ సీన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి.
- రామ్, శ్రీలీల కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై బోయపాటి అద్భుతంగా చూపించారు.
మైనస్ పాయింట్స్:
- మూవీలో కొన్ని సెంటిమెంట్ సీన్స్ అతికించినట్లుగా ఉన్నాయి.
- మూవీలో పాటలు యావరేజ్ గా ఉన్నాయి.
రేటింగ్ : 3/5
ట్యాగ్ లైన్ :
మంచి యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ చిత్రం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత రామ్ నుంచి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాస్ మూవీ వచ్చింది అని చెప్పవచ్చు.