CHANDRAMUKHI 2 REVIEW:రజనీ ఇంపాక్ట్ ను చంద్రముఖి 2 మూవీ లో లారెన్స్ తట్టుకోగలిగాడా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్!!!

Ads

2005లో రజనీకాంత్ ,జ్యోతిక ,నయనతార కాంబినేషన్లో విడుదలైన చంద్రముఖి చిత్రం ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలుసు. ఈ మూవీలో రజిని మరియు జ్యోతిక పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు పూర్తిగా ఫిదా అయ్యారు. ఈ చిత్రం విడుదలై 17 సంవత్సరాల పూర్తవుతున్న ఈ సమయంలో.. రాఘవ లారెన్స్ ,బాలీవుడ్ మోస్ట్ కాంట్రవర్సీ యాక్టర్ కంగనా రనౌత్ కాంబినేషన్లో తిరిగి ఈ చిత్రానికి సీక్వెల్ గా చంద్రముఖి 2 ఈరోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..

దర్శకత్వం,రచన: పి. వాసు
నిర్మాత: సుభాస్కరన్‌
తారాగణం: లారెన్స్‌,కంగనా రనౌత్,వడివేలు, మహిమ నంబియర్, రావు రమేష్ తదితరులు
ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 2023 సెప్టెంబరు 28

స్టోరీ:

రాధిక కుటుంబంలో అనుకోకుండా తలెత్తిన కొన్ని సమస్యలను తీర్చడం కోసం పండితుడు (రావు రమేష్) ను పిలిపిస్తారు. అయితే అనుకోకుండా వాళ్లకు లారెన్స్ కలవడం జరుగుతుంది. రాధిక కుటుంబం ఎప్పటినుంచో ఒక గుడిని బాగు చేయించాలి అని ప్లాన్ చేస్తుంటారు. అదే టైం కి వెట్టయన్ రాజు కోటలో ఏదో జరుగుతోంది అని ఒక అమ్మాయి అనుమానంతో తిరుగుతూ ఉంటుంది. లారెన్స్ ఈ అమ్మాయికి సహాయం చేస్తుంటాడు.

కోట దక్షిణం వైపు ఉన్నటువంటి ఒక గదిలో ఏదో ఉంది అనేది లారెన్స్ అనుమానం. అయితే ఆ తర్వాత అసలు గదిలో ఉన్నది చంద్రముఖి (కంగనా రనౌత్) అని, ఆ కోటలో ఎవరినో ఆ ఆత్మ ఆవహించింది అన్న విషయం తెలుస్తుంది. అసలు చంద్రముఖి ఎవరు? గతంలో రాజుకి చంద్రముఖి మధ్య గొడవ ఏమిటి? అసలు లారెన్స్ కు చంద్రముఖి తో సంబంధం ఏమిటి? తెలియాలి అంటే ఆన్ స్క్రీన్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

మామూలుగా సీక్వెల్ సినిమాలు అంటే వాటి మీద మొదట రిలీజ్ అయిన సినిమాల ఇంపాక్ట్ ఎంతోకొంత ఉంటుంది. పైగా ఈ సినిమాకి ముందుగా వచ్చిన చంద్రముఖి సినిమాలో నటించింది సూపర్ స్టార్ రజనీకాంత్ కావడంతో లారెన్స్ పాత్ర పై ఆ ప్రభావం చాలా ఉందనే చెప్పాలి. ఇక చంద్రముఖి పాత్రలో జ్యోతిక పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Ads

ఇప్పుడు తిరిగి ఈ సినిమా సీక్వెల్ కాబట్టి ప్రేక్షకులు పాత ఇంపాక్ట్ పోతుందేమో అన్న ఫీలింగ్ తోటే సినిమా చూడడం మొదలుపెడతారు. డైరెక్టర్ ఒకరే అయినా నటీనటులు మారారు కాబట్టి చిత్రంలో కాస్త డిఫరెన్స్ ఉందని చెప్పాలి. పైగా చంద్రముఖి రిలీజ్ అయిన తర్వాత ఇదే రేంజ్ లో ఎన్నో హారర్ కామెడీ చిత్రాలు వచ్చాయి. ఒక పాడుబడిపోయిన కోట ,కోటలో ఒక ఆత్మ, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్.. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కాబట్టి ఈ చిత్రంలో కొత్తదనం ఏమీ లేదని చెప్పాలి.

పైగా ఈ మూవీలో మొదటి పార్ట్ లో చూసింది అసలు చంద్రముఖి కాదని.. గంగ చంద్రముఖి గా ఉన్నట్లు ఊహించుకుంది అని.. ఇప్పుడు చూపిస్తున్నదే అసలు చంద్రముఖి అని చెప్పడం పెద్దగా ప్రేక్షకులకు రీచ్ కాలేదు. ఇక మిగిలిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. చంద్రముఖి క్యారెక్టర్ లో మెప్పించడం కోసం కంగనా ఎంత ప్రయత్నించినప్పటికీ జ్యోతిక ఇంపాక్ట్ మాత్రం ఆ క్యారెక్టర్ పైనుంచి పోలేదు. పాటలు యావరేజ్ గా ఉన్నాయి. సినిమా మరింత ఆసక్తికరంగా ముందుకు సాగదు.. ఎప్పుడు ఎక్కడ ఏదో మిస్సయిన భావన కలుగుతూనే ఉంటుంది.

ప్లస్ పాయింట్స్:

  • ఈ మూవీలో కాస్ట్యూమ్స్ ,సెట్టింగ్స్ చాలా కాస్ట్లీ గా ఉన్నాయి.
  • క్లైమాక్స్ సీన్స్ మూవీ కి ప్లస్ పాయింట్.
  • లారెన్స్ రజిని అంత కాకపోయినా…ఈ మూవీలో బాగా పర్ఫార్మ్ చేశాడు.
  • ఇక కంగనా తన పాత్రకు న్యాయం చేసింది.

మైనస్ పాయింట్స్:

  • కథ రొటీన్ గా ఉండడంతో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు అనిపిస్తుంది.
  • చంద్రముఖి పార్ట్ వన్ లో ఉన్న ఆ టెంపో ఈ మూవీ లో లేదు.
  • హారర్ కామెడీ అంతగా క్లిక్ కాలేదు.
  • సాంగ్స్ అనవసరంగా సినిమా మధ్యలో అతికించినట్లుగా ఉంటాయి.

రేటింగ్ : 2.5/5

ట్యాగ్ లైన్ :

చంద్రముఖి సీక్వెల్ గా కాకుండా మామూలు హారర్ చిత్రంగా దీనికి వెళ్లిన వాళ్లకు పర్వాలేదు అనిపిస్తుంది.
ఒరిజినల్ సినిమాని చూసి ఇది కూడా అలాగే ఉండాలి అనుకుంటే మాత్రం నిరాశ తప్పదు.

Previous articleబోయపాటి, రామ్ కాంబోలో రిలీజ్ అయిన “స్కంద” హిట్టా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!!
Next articleఅది ట్రైన్ అనుకున్నారా లేదా.? ఫుల్లు స్పీడుతో బ్రిడ్జి పై ట్రైన్ వస్తుంటే ఆ ముగ్గురు యువకులు..చివరకు.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.