తన భర్తలను కూడా నమ్మని ద్రౌపతి కృష్ణుని నమ్మడం వెనక అసలు రహస్యం ఇదేనా?

మనిషికి పుట్టుక దగ్గర నుంచి ప్రతిక్షణం జ్ఞానాన్ని పంచే భగవద్గీత ఉద్భవించింది మహాభారతంలోని కురుక్షేత్రం నుంచి. అందుకే మహాభారతంలోని ప్రతి ఒక్క పాత్రకు ఎంతో విశిష్టత ఉంది. మరి ముఖ్యంగా పాండవులను వివాహమాడిన ద్రౌపతి మహాభారతం మలుపు తిరగడానికి ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. ఆమెకు అయిదుగురు భర్తలు అన్న విషయం తప్ప ఆమె గురించి పెద్దగా చాలామందికి తెలియదు.

ద్రౌపదిని స్వయంవరంలో తన దానిగా చేసుకున్న అర్జునుడు కుంతి వద్దకు తీసుకువెళ్తాడు. తాను తీసుకువచ్చిన బహుమానాన్ని చూడమని అర్జునుడు కోరినప్పుడు పరధ్యాసగా ఉన్న కుంతీదేవి ఏమి తెచ్చిన ఐదుగురు పంచుకోండి అని సమాధానం ఇస్తుంది. తల్లి మాట ప్రకారం పాండవులు ఐదుగురు ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత నిజం తెలుసుకున్న కుంటి బాధపడినప్పటికీ…అది ద్రౌపతికి పూర్వజన్మలో వచ్చిన వరం అని తెలుసుకొని ఊరట చెందుతుంది.

అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా ద్రౌపతి ఎంతో సత్యతగా ఉండేది. ఆమె కొన్ని నెలల పాటు ఒకరి భార్యగా వ్యవహరించేది. అలా ఆమె ఐదుగురిలో ఒకరి భార్యగా ఉన్న సమయంలో మిగిలిన నలుగురు ఆమె ఉన్న చోటుకు వెళ్లకూడదు.. పొరపాటున అలా వెళ్లాల్సివస్తే నియమం తప్పిన వారికి ఒక సంవత్సరం పాటు అరణ్యవాసం శిక్షగా విధించడం జరుగుతుంది. ఐదుగురు అన్నదమ్ములు ఈ నియమాన్ని పాటిస్తూ ఉంటారు.

అయితే ఒకసారి కొందరు తన పశువులను దొంగలించారని రక్షించమని ఒక వ్యక్తి ఒక బ్రాహ్మణుడు అర్జుని శరణు వేడుతాడు. ఆ సమయానికి అర్జునుడి విల్లు ధర్మరాజు ద్రౌపది ఉన్నటువంటి మందిరంలో ఉంటుంది. అలా విల్లు కోసం వెళ్ళిన అర్జునుడు ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు అరణ్యవాసం చేస్తాడు. ద్రౌపతి దృక్పథుడు చేసిన యజ్ఞం నుంచి పుడుతుంది. అందుకే ఆమె యజ్ఞసేని గా పేరుపొందింది.

ఆమె శ్రీకృష్ణుని సహోదరుడుగా భావించేది. కౌరవ సభలో ఆమెకు అవమానం జరుగుతున్నప్పుడు కేవలం శ్రీకృష్ణుడు ఒక్కడే ఆమెను కాపాడాడు . ఆ సమయంలో ఆమెకు ఆమె భర్తలపై నమ్మకం పోయిందట. ఒక భర్త నుంచి మరొక భర్త దగ్గరకు వెళ్లే సమయానికి ద్రౌపతి కన్యగా మారేదట. ఎలాగా అంటే.. ఆమెకు ఉన్న వరం ప్రకారం ఒక భర్త నుంచి మరొక భర్తకు వెళ్లే సమయం లో ఆమె అగ్ని నుంచి నడిచేది. అప్పుడు ఆమె తిరిగి కన్యగా మారేడు. ఎవరు ఇంటికి వచ్చిన కడుపు నిండుగా భోజనం పెట్టనిదే ద్రౌపతి వారిని పంపించేది కాదట.

Previous articleఒకే ఒక్క కండీషన్ వల్ల తెలుగు స్టార్ హీరో సినిమా వదులుకుందా..? అదేంటంటే..?
Next articleగీజర్ కొనలేక వేడి నీళ్ల కోసం… ఈ వ్యక్తి చేసిన పని చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!