మహానటి “సావిత్రి” అభిమానికి రాసిన లేఖ చూశారా..? ఏం రాశారంటే..?

Ads

మహానటి సావిత్రి గురించి గొప్పగా వర్ణించినా కూడా తక్కువే. ఆమె నటన గురించి మాటలు సరిపోవు. అప్పటి నుండి ఇప్పటివరకు ఆమె నటనకు సాటి అయినవారు ఎవరు రాలేదు. ఆమె శాశ్వతంగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు.

Ads

సావిత్రి గురించి చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం తలచుకుంటూనే ఉంటారు. తెలుగు ఇండస్ట్రీ ద్వారా పరిచయమైన సావిత్రి తెలుగుతో పాటుగా తమిళ భాషలోను అగ్రనటిగా రాణించారు. తాజాగా ఆమె తన అభిమానికి రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సావిత్రి గుంటూరు జిల్లాలోని చిర్రావూరు గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించింది. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది. పెదనాన్న అయిన కొమ్మారెడ్డి వెంకట్రామయ్య సావిత్రిని పెంచారు. చిన్నతనం నుండే నటన పై ఉన్న సావిత్రి నాటకాలలో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో నటించడానికి  మద్రాసుకు వెళ్ళి, చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టి అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా టాప్ హీరోయిన్ ఎదిగి, నడిగర్ తిలగం బిరుదు అందుకుంది. తమిళ హీరో జెమిని గణేశన్ ను వివాహం చేసుకుంది. అప్పటికే ఆయనకు పెళ్లి అయ్యి, పిల్లలు కూడా ఉన్నారు.
సావిత్రికి కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీష్ కుమార్ జన్మించారు. కుటుంబ కలహాలు, ఆర్థికంగా సమస్యల వల్ల ఎంతో గొప్పగా బ్రతికిన ఆమె, చివరి దశలో దుర్భర జీవితాన్ని గడిపి, అనారోగ్యం వల్ల ఏడాది పాటు కోమాలో ఉండి 46 ఏళ్ళ వయసులో కన్నుమూసింది. అయితే ఆమె అప్పట్లో అభిమానికి రాసిన ఒక లేఖ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
ఆ లేఖ లో “ప్రియమైన తమ్ముడు. నీవు ప్రేమతో రాసిన ఉత్తరం అందింది. చాలా సంతోషం,నీ అభిమానానికి ఎంతో ఆనందం, నాకు ఇద్దరు బిడ్డలు, అమ్మాయి పెద్దది, వివాహం అయిపోయింది. ఒక మగ బిడ్డ కూడా, రెండవ వాడు సతీష్ బాబు. వడి పైన ఆశలన్నీ, ఆడపిల్లలు ఆడపిల్లలేకని ఇదపిల్లలు కాదని మ అమ్మ నిరూపించుకున్నది. బాబు చిన్నవాడే ఏడవ క్లాస్ చదువుతున్నాడు. బాగా చదివించాలని నా తాపత్రయం ఆ పై భగవతుని దయ. నీ ప్రేమాభిమానాలకు నా సంతోషాన్ని తెలియపరుస్తూ నా ఫోటో నీకు పంపిస్తున్నాను” అని రాసుకొచ్చారు.

Also Read: నందమూరి బాలకృష్ణ పెళ్లి పత్రిక చూసారా..? ఏం రాసి ఉందంటే..?

Previous articleవైయస్ షర్మిల కొడుకు పెళ్లికి ఫోటోగ్రాఫర్ ఎవరో తెలుసా..? ఒక్క ఫోటో సెషన్ కి ఎంత తీసుకుంటారు అంటే..?
Next articleతన భర్తలను కూడా నమ్మని ద్రౌపతి కృష్ణుని నమ్మడం వెనక అసలు రహస్యం ఇదేనా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.