“పుష్ప” లాగే “నెగిటివ్ టాక్”తో హిట్ ని అందుకున్న 7 సినిమాలు.!

Ads

కొన్ని సినిమాలు హిట్ టాక్ తో వస్తాయి కానీ ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు అయితే మొదట నెగిటివ్ టాక్ ని తెచ్చుకుని తర్వాత సినిమాలు పెద్ద హిట్ అయిపోతాయి. డైరెక్టర్లు సినిమాని తెర మీదకి తీసుకోవచ్చేటప్పుడు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాని తీస్తారు కానీ ఒక్కొక్కసారి అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోతుంటారు. సినిమా ఫ్లాప్ అవుతూ ఉంటుంది. అయితే మొదట్లో సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్ ని తెచ్చుకోకుండా కొన్ని సినిమాలు నెగిటివ్ టాక్ తోనే హిట్ అయిపోతూ ఉంటాయి. ఆ సినిమాల లిస్ట్ చూద్దాం.

  1. నాన్నకు ప్రేమతో:

2016 లో సంక్రాంతికి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఈ మూవీ వచ్చింది. మొదట ఓవర్ ఇంటలిజెన్స్ యాక్షన్ అని చెప్పి నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది ఈ సినిమా కానీ లాజిక్ అర్థమయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సక్సెస్ ని అందుకుంది.

2. సరైనోడు:

బోయపాటి శ్రీను 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తీసుకువచ్చారు అల్లు అర్జున్ హీరోగా నటించారు. నెగటివ్ టాక్ అందుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 127 కోట్ల కలెక్షన్ తో హిట్ అయింది సరైనోడు మూవీ.

3. ఇస్మార్ట్ శంకర్:

Ads

పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రామ్ హీరోగా నటించారు. అయితే ఈ సినిమా మొదటి రోజుల్లో నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. కానీ తర్వాత నెమ్మదిగా సక్సెస్ అయింది.

4. సోగ్గాడే చిన్నినాయన:

నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన మొదట విమర్శలని అందుకుంది. తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది సినిమా.

5. సన్నాఫ్ సత్యమూర్తి:

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా మొదట నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. కానీ హిట్ అయింది.

6. సర్కారు వారి పాట:

మొదట సర్కారు వారి పాట సినిమాకి కూడా నెగటివ్ టాక్ వచ్చింది. పరశురామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు హిట్ టాక్ ని సంపాదించుకున్న ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిపోయింది.

7. పుష్ప:

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా కూడా నెగటివ్ టాక్ ని మొదట తెచ్చుకుంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో పుష్ప సినిమా హిట్ అయింది. ఇక ఇప్పుడు అంతా పుష్ప టు కోసం చూస్తున్నారు.

Previous articleఇంతకముందు 12 ఏళ్ళకి “మెచ్యూర్” అయ్యే ఆడపిల్లలు…ఇప్పుడు 8-9 ఏళ్లకే అలా ఎందుకు అవుతున్నారంటే.?
Next articleవిక్రమార్కుడు లో రవితేజ కూతురు ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఎంత అందంగా ఉందో చూడండి.!