ఎందుకు ”కాయిన్స్” మీద గీతలు ఉంటాయి..? దాని వెనుక ఇంత పెద్ద కారణమా..?

Ads

రోజు రోజుకి ఎన్నో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. గతంలో ఉన్నట్లు ఇప్పుడు ఉండడం లేదు. ప్రతి చిన్న విషయంలో కూడా పెద్ద మార్పు వస్తూ వుంది. ఇప్పుడు ఉన్నట్లు భవిష్యత్తులో ఉండకపోవచ్చు. అప్పటి పాత పద్ధతులు మారిపోయినట్టే. పైగా కాలం గడిచే కొద్దీ టెక్నాలజీ పెరగడం.. మనం అభివృద్ధి చెందడంతో అనేక మార్పులు వస్తున్నాయి.

డబ్బులని ముద్రించే పద్దతి కూడా మారింది. ఇది వరకు రూపాయి నోట్లు ఇప్పుడు చెల్లడం లేదు అలానే ప్రభుత్వం నోట్లని రద్దు చేసి కొత్త నోట్లని ప్రవేశపెట్టింది.

ఇలా డబ్బులకు సంబంధించి ఎన్నో మార్పులు వస్తూనే ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. మీకు ఈ సందేహం ఎప్పుడైనా కలిగిందా..? ఎందుకు కాయిన్స్ కి ఎడ్జెస్ లో కట్ లాగ ఉంటుంది అని.. కాయిన్స్ కి ఎడ్జెస్ లో గీతలుగా.. ఏదో చెక్కినట్లుగా ఎందుకు ఉంటుంది..? ఈ సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది. మీకు కూడా ఈ సందేహం ఉంటే వెంటనే క్లియర్ చేసుకోండి.

Ads

పూర్వ కాలంలో చూసుకున్నట్లయితే వెండి బంగారంతో నాణేలని తయారు చేసేవారు. దీంతో ప్రజలు కాయిన్స్ ని కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటూ కావలసినంత బంగారం తీసుకునేవారు. అయితే చిన్నగా కట్ చేయడం వలన ఎవరికి తెలియదు అని కొద్దిగా కట్ చేసుకునేవారు. ఆ తర్వాత మళ్లీ ఇంకో నాణేలని కట్ చేసుకునేవారు. కొంచెం కొంచెం కట్ చేయడం వలన ఎటువంటి లాభం లేదు కానీ తరచు ఇలా కట్ చేస్తూ ఉంటే ఎక్కువ బంగారం లేదా వెండి వస్తుంది కదా..?

అందుకనే అప్పట్లో వాళ్లు ఇలా కట్ చేస్తూ విలువైన, ఖరీదైన లోహాలని తీసుకుని ఇలా సొమ్ము చేసుకునే వారు. దీనితో అటువంటి తప్పులు జరగకూడదని కాయిన్స్ పక్కన చెక్కినట్టు చేయడం మొదలుపెట్టారు ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరూ లోహాలను తీసుకునేందుకు కుదరదు. అందుకనే కాయిన్స్ కి ఇలా ఉంటుంది.

Previous articleభర్త మనసును గెలుచుకోవడానికి 3 మార్గాలు..
Next article”బాత్ రూమ్ సింక్” కి ఎందుకు చిన్న రంధ్రాన్ని ఇస్తారు.. దీని వెనుక కారణం ఏమిటో తెలుసా..?