నాని ప్రేమ కథ గురించి తెలుసా..? అన్ని సంవత్సరాలు వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే..?

Ads

హీరో నాని గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సైలెంట్ గా వచ్చి హిట్లు సాధించడం ఇతని నైజం.

నాని కెరియర్ లో ఆర్జెగా పనిచేసి తర్వాత క్లాప్ బాయ్, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగిన వ్యక్తి. సినిమా ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు.

hero nani love story

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న నానికి అదృష్టం ఇంద్రగంటి మోహన్ రూపంలో వరించింది. ఎందుకంటే నానిని మొట్టమొదటిసారి హీరోని చేసింది ఇంద్రగంటి మోహన్. అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ నాచురల్ స్టార్ గా పేరు సంపాదించాడు నాని. ఇక అతని పర్సనల్ విషయానికి వస్తే 2012లో అంజన ఎలవర్తిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మొదట వీరి పెళ్లికి అంజన పేరెంట్స్ ఒప్పుకోలేదట.

hero nani love story

Ads

దానికి కారణం నాని కెరియర్ పరంగా ఇంకా స్థిరపడకపోవడం. అందుకని అంజన పేరెంట్స్ అంగీకారంతో పెళ్లి చేసుకోవడం కోసం నాలుగేళ్లు వెయిట్ చేశారు ఈ లవ్ బర్డ్స్. కెరియర్ లో స్థిరపడిన తరువాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న ఈ జంట కి 2017లో అర్జున్ పుట్టాడు. అర్జున్ అంటే నానికి చాలా ఇష్టం. అందుకే జెర్సీ సినిమాలో నాని పాత్ర పేరు అర్జున్.అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అంటే మొదట అంజన ఎఫ్ఎం లో వర్క్ చేసేది.

hero nani love story

ఆ సమయంలోనే అంజన ప్రేమలో నాని పడిపోయాడు, లవ్ ట్రాక్ నడిపాడు. మొదట్లో ఫ్రెండ్షిప్ గా మొదలై తరువాత ఇద్దరి మధ్య లవ్ నడిచింది. అంజన ని పికప్ చేసుకోవడానికి నాని గంటల తరబడి ఎఫ్ఎం ఛానల్ ఆఫీస్ ముందు వెయిట్ చేసేవాడంట. అయితే వీరి ప్రేమ కధ లో ఎలాంటి ట్విస్టులు, చేజింగులు లేకుండా నేచురల్ గా సాగిపోవటంతో నాచురల్ స్టార్ లవ్ స్టోరీ కూడా చాలా న్యాచురల్ గా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

Previous articleకాబోయే కోడలి కోసం అంబానీ ఇస్తున్న బహుమతుల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఏం ఉన్నాయంటే..?
Next article“అనుష్క శర్మ” రెండవసారి గర్భం దాల్చిన విషయాన్ని ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారు..? కారణాలు ఇవేనా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.