ఈ హీరో బర్త్ డే నాలుగేళ్లకు ఒకసారే…ఫిబ్రవరి 29 న పుట్టిన ఏకైక టాలీవుడ్ హీరో ఇతనే.!

Ads

అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమా ద్వారా శ్రీ విష్ణు హీరోగా మారాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కానీ శ్రీ విష్ణుకు మాత్రం నటుడిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చింది.

ఆ తర్వాత మెంటల్ మదిలో, నీది నాది ఒకటే కధ, బ్రోచేవారెవరురా, తిప్పరా మీసం, గాలి సంపత్, రాజరాజ చోర, సామజ వరగమన లాంటి సినిమాలు చేస్తూ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే శ్రీ విష్ణు డిఫరెంట్ గా ఉండే కథలను ఎంచుకోవడంలో ఎక్స్పర్ట్. అలాగే తన పుట్టినరోజును కూడా డిఫరెంట్ గా నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటూ ఉంటాడు. నిజమేనండి శ్రీ విష్ణు నాలుగు సంవత్సరాల ఒకసారి పుట్టినరోజు చేసుకుంటాడు ఎందుకంటే అతని పుట్టినరోజు ఫిబ్రవరి 29 కాబట్టి. చాలా తక్కువ మంది ఈ రోజున జన్మిస్తారు అందులోనూ మన టాలీవుడ్ లో ఈరోజు న పుట్టినరోజు జరుపుకుంటున్న ఏకైక నటుడు శ్రీ విష్ణు.

this hero celebrates his birthday once in four years

Ads

నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాడు. తాజాగా ఒక వీడియోలో మాట్లాడుతూ నాలుగేళ్లుగా నేను పుట్టినరోజు జరుపుకోలేదు. లీప్ ఇయర్ రోజున పొట్టడంతో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ నా పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పాడు. ఇతని పుట్టినరోజు నాడే అతని కొత్త సినిమాలు అనౌన్స్ చేసాడు. రాజరాజ చోర చిత్రం ప్రీక్వెల్ “స్వాగ్” పేరుతో ఒక చిత్రాన్ని పుట్టినరోజుకి ముందు రోజే అనౌన్స్ చేశారు.

this hero celebrates his birthday once in four years

ఆ తర్వాత గీత ఆర్ట్స్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు.ఇది శ్రీ విష్ణుకి 18వ చిత్రం దీనికి తాత్కాలికంగా ఎస్వి18 టైటిల్ ని పెట్టారు. చాలాకాలంగా పెద్ద బ్యానర్ లో పనిచేయాలని ఎదురుచూస్తున్న శ్రీ విష్ణు కి ఇది కచ్చితంగా పెద్ద పుట్టినరోజు ప్రజెంటేషన్. నేను వీడని నీడను నేనే ఫేమ్ కార్తీక్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.

Previous articleప్రేమించి పెళ్లి చేసుకున్నాడు…కానీ పెళ్లిరోజే భార్యని..! అనుమానంతోనే అఘాయిత్యం!
Next articleVYOOHAM REVIEW : రామ్ గోపాల్ వర్మ “వ్యూహం” స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.