కాకి ఏ విధంగా కనిపిస్తే అదృష్టం కలుగుతుంది..? శకున శాస్త్రం ఏం చెబుతోంది అంటే..?

Ads

మన పూర్వీకులు పాటించే ఆచారాలని మనం కూడా పాటిస్తూ ఉంటాము. అయితే నిజానికి వాళ్లు పాటించడం వెనక అర్థం మనకి తెలియకపోయినా సరే మనం వాళ్లు ఏ విధంగా చేశారో మనం కూడా అదే విధంగా చేస్తూ ఉంటాము. మన భారత దేశంలో ఎన్నో సంప్రదాయాలని నమ్మకాలని మనం అనుసరిస్తూ ఉంటాము. హిందూ సంప్రదాయంలో శకున శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.

కాకి శకునం కూడా అందులో ఒకటి. కాకి తన్నితే అపశకునం అని ఎప్పటి నుండో కూడా ప్రజల్లో బలంగా నాటుకుంది. కాకి తన్నితే మరణ వార్త వింటారని శని తాండవిస్తుందని అంటారు అలానే కాకి పితృ దేవతలకి ప్రతినిధి అని హిందూ ధర్మాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈరోజు కాకి ప్రవర్తించే తీరుని బట్టి శుభ, అశుభ శకునాలు ఉంటాయని మన పెద్దలు ఎప్పుడో నిర్ణయించారు అయితే ఆ శకునాల గురించి వాటి వల్ల కలిగే ఫలితం గురించి ఈరోజు మనం చూద్దాం..

Ads

  • కాకి నీరు తాగుతూ మనకి కనిపిస్తే అది శుభం. రాబొయ్యే రోజుల్లో డబ్బు సంపాదించబోతున్నారని లేదంటే విజయాన్ని అందుకుంటారని దానికి సంకేతం.
  • శకున శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పు పైన కాకులు వెళితే అది ఎంతో శుభము.
  • మ‌న ఇంటి మీద కానీ ఇంటి ముందు కానీ కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారని చాలా మంది నమ్ముతారు.
  • బ‌య‌ట‌కు వెళ్లున‌ప్పుడు కాకి కుడి నుండి ఎడమ పక్క కి వస్తే ఆ పని చక్కగా పూర్తి అయిపోతుంది అని అంటారు. అదే ఎడ‌మ వైపు నుండి కుడి వైపుకు వ‌స్తే అశుభం.
  • కాకులు గుమికూడి ఇంటి దగ్గర కనుక పోట్లాడుకుంటూ ఉంటే అది అశుభమే. యజమానికి త్వరలో కష్టాలు వస్తాయట.
  • కాకి నోటిలో ఆహారం పెట్టుకు కూర్చోవడం లేదా ఎగురుతున్నట్లు మీరు చూస్తే అది చాలా మంచిది. అతిపెద్ద కోరిక త్వరలో నెరవేరబోతుందని శకున శాస్త్రం అంటోంది.
  • మనం ఇంటి నుండి వెళ్ళేటప్పుడు మూడు కాకులు ప్రశాంతంగా కూర్చుంటే ఆ పని పూర్తి అవుతుంది అని శకున శాస్త్రం అంటోంది.
  • ఇంటి కప్పు పై కాకి కూర్చొని అరిస్తే ధన లాభం కలుగుతుంది.
  • ఇచ్చిన అప్పుని వసూలు చేయడానికి వెళ్తుంటే కాకి మన తలపై ఉంచి ఎగిరిపోతే ఆ అప్పు వసూల్ అవుతుంది.

 

Previous articleCustody Review: నాగ చైతన్య ”కస్టడీ” సినిమా రివ్యూ హిట్టా..? ఫట్టా..?
Next articleవారానికి ఒక్కసారి ఇలా నడిస్తే ఎన్నో లాభాలు.. ఏయే మార్పులు వస్తాయి అంటే..?