Custody Review: నాగ చైతన్య ”కస్టడీ” సినిమా రివ్యూ హిట్టా..? ఫట్టా..?

Ads

సినిమా: కస్టడీ
నటీనటులు : నాగచైతన్య, కృతిశెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి తదితరులు
దర్శకత్వం : వెంకట్ ప్రభు
నిర్మాత : శ్రీనివాస చిట్టూరి
సంగీతం : ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
విడుదల తేదీ : 12,మే 2023

స్టోరీ :

శివ (నాగ చైతన్య) ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్. CBI ఆఫీసర్ (సంపత్), హిట్‌మాన్ రాజు (అరవింద స్వామి) పోలీస్ ఆఫీసర్ (R. శరత్ కుమార్) మధ్య కథ ఉంటుంది. CBI మరియు మాఫియా మధ్య ఎదురుకాల్పుల్లో చిక్కుకోవడంతో శివ వాళ్ళు చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుంది. ఈ చేస్ లో శివ ప్రేమించిన రేవతి కూడా చేరుతుంది. రాజుని ఎందుకు వెంబడిస్తున్నారనేదే మిగతా కథ.

రివ్యూ:

ఒక మంచి పోలీస్ ఆఫీసర్ కింద నాగ చైతన్య అద్భుతంగా నటించాడు. చాలా చక్కటి పాత్రని నాగచైతన్య ఎంచుకున్నాడు. అరవింద స్వామి కూడా చాలా చక్కగా నటించాడు. కృతి శెట్టి కి కొంచెం తక్కువ పాత్ర ఉంది. ప్రియమణి కూడా తన పాత్రకి తగ్గట్టుగానే చక్కగా నటించింది. మిగిలిన పాత్రలో నటించిన వాళ్లందరూ కూడా బాగానే నటించారు.

Ads

అయితే నేరేషన్ కాస్త స్లోగా ఉంది దాంతో సినిమా మీద పెద్ద ప్రభావమే పడింది. ఆడియన్స్ లో కూడా ఆసక్తి తగ్గే విధంగా ఉంది. యువన్ శంకర్ రాజా ఇళయరాజా బ్యాగ్రౌండ్ స్కోర్ పాటలు కూడా బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఎడిటింగ్ కాస్త బాగుంటే ఇంకా బాగుండేది. స్క్రిప్ట్ ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకి ప్లస్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి.

ప్లస్ పాయింట్స్:

బ్యాగ్రౌండ్, స్కోర్ పాటలు
నటీ, నటులు
యాక్షన్ సీక్వెన్స్ లు                                                                                                ప్రొడక్షన్ విలువలు                                                                                                      కొన్ని చేసులు

మైనస్ పాయింట్స్:

సాగదీత సన్నివేశాలు                                                                                                        ఎడిటింగ్                                                                                                                      పూర్తి స్క్రిప్ట్                                                                                                                    ఎంటర్టైన్మెంట్ లేకపోవడం
రిపీట్ అయిన చేసులు

రేటింగ్: 2/5

Previous articleకేజీఎఫ్ లో ఈ సీన్ చూసారా ..? దీని వెనుక ఇంత అర్థమా..?
Next articleకాకి ఏ విధంగా కనిపిస్తే అదృష్టం కలుగుతుంది..? శకున శాస్త్రం ఏం చెబుతోంది అంటే..?