వెంక‌టేశ్వ‌ర స్వామికి వ‌డ్డీ కాసుల వాడ‌నే పేరు ఎలా వచ్చింది అంటే..?

Ads

తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల నుండి భక్తులు తిరుమల వచ్చి ఏడుకొండల వారిని దర్శించుకుంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలయాలు, ప్రార్థన మందిరాలలో అత్యంత ఎక్కువ ఆదాయం ఉన్న రెండో పుణ్యక్షేత్రం మన తిరుమల. మొదటి స్థానంలో వాటికన్ సిటీ ఉంది. తిరుమల విశేషత గురించి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది భక్తులు ఏడుకొండల స్వామివారి దర్శనం చేసుకుంటే కష్టాల నుండి బయటపడచ్చని ఆనందంగా జీవించవచ్చని ప్రతి ఏడాది కూడా తిరుమల వెళుతూ ఉంటారు.

మెట్ల దారి నుండి కూడా ప్రతిరోజు చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారు. కొన్ని వేలమంది భక్తులు ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ప్రత్యేక కార్యక్రమాలు వంటివి జరిగాయి అంటే వచ్చే భక్తుల గురించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల టైంలో లక్షల్లో భక్తులు వెళ్లారు. అయితే వెంకటేశ్వర స్వామిని ఎన్నో పేర్ల తో పిలుస్తారు.

Ads

శ్రీనివాసుడు, గోవిందుడు, ఏడుకొండలవాడు, ఆపదమొక్కులవాడు, అనాదరక్షకుడు, వడ్డీ కాసుల వాడు మొదలైనవి. ఎందుకు వడ్డీ కాసుల వాడని పిలుస్తారు..? దాని వెనుక కారణం ఏంటి..? ఈ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సాధారణంగా దేవుళ్ళకే దేవతలకి ఎన్నో పేర్లు ఉంటాయి వాటి వెనక పెద్ద కారణమే ఉంటుంది. అలానే మన వెంకటేశ్వర స్వామి వారిని వడ్డీకాసులవాడు అనడానికి పెద్ద కారణమే ఉంది. ఒకానొక సమయంలో వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి భూలోకానికి వచ్చారట.

లక్ష్మీదేవిని వైకుంఠంలో వదిలేయడంతో ఆయన దగ్గర డబ్బులు లేవు ఆయన పెళ్లికి డబ్బులు లేకపోవడంతో కుబేరుడు వెంకటేశ్వర స్వామికి పెళ్ళికి అయ్యే ఖర్చు ఇచ్చారట. ఒక ఎడాదిలో ఆ అప్పును తీర్చేస్తానని వెంకటేశ్వర స్వామి వారు కుబేరుడుతో చెప్పారు. ఏడాది దాటిపోయింది. ఆ అప్పు తీర్చలేదు. అప్పటినుండి కుబేరుడికి ఇవ్వాల్సిన అప్పు వడ్డీ అలాగే పెరిగి పెరిగి ఎక్కువ అయిపోయింది. అయినా కూడా వెంకటేశ్వర స్వామి వారు వడ్డీనే కడుతూ వచ్చారు. ఈ కారణంగానే వడ్డీ కాసులు వాడని వెంకటేశ్వర స్వామిని పిలుస్తారు.

Previous articleఒకరిని దీవించేటప్పుడు అక్షింతలు ఎందుకు వెయ్యాలి..? కారణం ఏమిటో తెలుసా..?
Next articleసమరసింహారెడ్డి సినిమాలో నటించిన ఈ అమ్మాయి మీకు గుర్తుందా..? రామ్ చరణ్ కి ఏం అవుతుందంటే..?