Takkar Movie Review: టక్కర్ మూవీ రివ్యూ.. సిద్దార్ధ్ మూవీ హిట్టా..?, ఫట్టా..?

Ads

ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ సిద్ధార్థ్ చాలా గ్యాప్ తరువాత తెలుగులో నటిస్తున్నాడు. హీరో సిద్ధార్థ్ తమిళంలో నటించిన టక్కర్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశాడు. యాక్షన్ క్రైమ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నారు.

సినిమా: టక్కర్
నటీనటులు : సిద్ధార్థ్, దివ్వాన్ష కౌశిక్, యోగిబాబు తదితరులు
దర్శకుడు: కార్తీక్ జి క్రిష్
సంగీతం : నివాస్ కే ప్రసాద్
నిర్మాణం : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,
విడుదల తేదీ: జూన్ 9, 2023
స్టోరీ :

టక్కర్ అనేది ధనవంతుడు కావాలని కలలు కనే పేద యువకుడు(సిద్దార్ధ్) కథ. ఎలాగైనా డబ్బు సంపాదించాలనే తపన ఉన్న యువకుడు, డబ్బు సంపాదించడం కోసం, ఎలాంటి దారిని ఎంచుకున్నాడు. వాటి వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడుతాడు. చివరికి ఆ యువకుడు ధనవంతుడు అయ్యడా? లేదా? తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..
రివ్యూ:

Ads

ఒకప్పడు లవర్ బాయ్ గా పలు చిత్రాలతో అలరించిన సిద్ధార్థ్, కొన్నేళ్ళ పాటు టాలీవుడ్ కి దూరం అయ్యాడు. చాలా గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చిన సిద్దార్ధ్ ప్రయోగాలు చేస్తున్నారు. మహాసముద్రం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన సిద్దార్ధ్. డిఫరెంట్ పాత్రలను, కథలను ఎంచుకుంటున్నారు. ఆయన తాజా మూవీ టక్కర్. ఈ సినిమా కూడా సిద్ధార్థ్ గత చిత్రాలకు పోలిక లేకుండా ఉంది. ఈ సినిమా యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందింది.
సిద్ధార్థ్ అనగానే ఇప్పటికీ బొమ్మరిల్లు మూవీలోని క్యూట్ లుక్ గుర్తుకు వస్తుంది.అయితే ఈ చిత్రంలో సిద్ధార్థ్ లుక్ పూర్తిగా డిఫరెంట్ గా, స్టైల్ గా ఉంది. మూవీని ఎలివేట్ చేయడానికి అది ప్లస్ పాయింట్ కాలేదు. పర్ఫార్మెన్స్ విషయంలో సిద్ధార్థ్ తన క్యారెక్టర్ కి తగినట్లు నటించారు. అంతగా యాక్టింగ్ కి ఆస్కారం ఉన్న క్యారెక్టర్ కాదు. హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్ నటన పరవాలేదనేట్లు ఉన్నా, గ్లామరస్ గా కనిపించారు.

ఇక మిగతా నటీనటులు పాత్రల మేరకు నటించారు. దర్శకుడు చాలా సింపుల్ పాయింట్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. అనుకున్న పాయింట్ ను తెర పై చూపించలేకపోయాడు. మూవీలో యాక్షన్ సీన్స్ చాలా ఉన్నా, సినిమాకి ప్లస్ అవలేకపోయాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు. సెకండ్ హాఫ్ అయితే బోరింగ్ అనేలా ఉంది.
ప్లస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్
యాక్షన్ సన్నివేశాలు,

మైనస్ పాయింట్స్:

కొన్ని సన్నివేశాలు,
సెకండ్ హాఫ్,
బలహీనమైన కథనం,

రేటింగ్: 2/5

Previous articleVimanam movie review: స‌ముద్రఖ‌ని, అన‌సూయ నటించిన విమానం మూవీ హిట్టా..?, ఫట్టా..?
Next articleమేకప్ లేకుండా ఈ 14 హీరోలు ఎలా ఉంటారో మీకు తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.