ఓటీటీలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సాధించిన ఈ మూవీ చూసారా..? ఏకంగా 50 మిలియన్ నిమిషాలు..!

Ads

థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల ఫలితం ఎలా ఉన్నప్పటికీ, ఓటీటీల్లో రిలీజ్ అయిన కొన్ని సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల ప్రముఖ ఓటీటీ జీ5 లో విడుదల అయిన ప్రేమ విమానం మూవీ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

‘మ్యాడ్’ మూవీతో థియేటర్లలో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో సంగీత్ శోభన్ నటించిన ప్రేమ విమానం మూవీలో శాన్వీ మేఘన హీరోయిన్ గా నటించగా, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించింది.
ప్రేమ విమానం మూవీ అక్టోబ‌ర్ 13 నుండి ఓటీటీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, జీ 5 సంస్థ సంయుక్తంగా నిర్మించింది. ఈ చిత్రంలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా నటించారు. సంతోష్ కాటా ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెరకెక్కించారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.
ఎలాగైనా విమానం ఎక్కాలని కలలు కనే ఇద్దరు పిల్లలు, కొత్త లైఫ్ ను మొదలుపెట్టడానికి విమానం ఎక్కి దూరంగా వెళ్లాలనుకునే లవర్స్, వారి ప్రయాణంలో ఎదురయ్యే సంఘటనలు, బాధలు, సంతోషాలు, నవ్వుల వంటివాటితో ఆడియెన్స్ ను మెప్పించేలా తెరకెక్కించారు. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కొద్దిరోజులలో 50 మిలియ‌న్స్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను నమోదు చేసింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ మూవీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ పోస్టర్ ని రిలీజ్ చేసింది.
ప్రేక్ష‌కులు అద్భుతమైన రెస్పాన్స్‌తో ఈ చిత్రాన్ని ఆద‌రిస్తున్నారని పేర్కొంది. సంగీత్ శోభన్ ఇంతకు ముందు జీ5 ఓటీటీలో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ తో విజయం సాధించారు. ఆ తరువాత ప్రేమ విమానం మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల థీయేటర్లలో రిలీజ్ అయిన మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇందులో ముగ్గురు హీరోలు ఉన్నప్పటికీ తన నటన, కామెడీ టైమింగ్ తో సంగీత్ శోభన్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

Ads

Also Read: మెగా 156 సినిమా టైటిల్ ఇదేనా..? విలన్ ఎవరంటే..?

Previous articleహీరో ఉదయ్ కిరణ్ రాసిన చివరి లేఖలో ఏముందో తెలుసా?
Next articleమీ చేతి మీద ఇలాంటి “x” గుర్తు ఉందా..? దాని అర్ధం తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.