సీనియర్ ఎన్టీఆర్ గారి పెళ్లి పత్రికను ఎప్పుడైనా చూసారా.?

Ads

అన్న గారి గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్ అందరికీ సుపరిచితమే. చాలా మంచి పేరు ని ఆయన సంపాదించారు. సినిమాల్లో రాజకీయాల్లో కూడా సీనియర్ ఎన్టీఆర్ పేరు తెచ్చుకోవడం జరిగింది. పైగా ఆయన కి తెలుగు భాష మీద పట్టు కూడా ఎక్కువే. సినిమా లోనే కాదు ఆయన చదువు లో కూడా ముందుండే వారు.

ఈయనకి మద్రాసు సర్వీసు కమిషన్ ఎగ్జామ్ లో అయితే ఏడవ ర్యాంక్ వచ్చింది. ఇక ఈయన పెండ్లి విషయానికి వస్తే.. ఎన్టీ రామారావు గారు బసవతారకం గారి ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Ads

అయితే వాళ్ళ పెండ్లి శుభలేఖ ని ఎప్పుడైనా చూసారా..? ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో తెగ షికార్లు కొడుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీన్ని చూస్తే సరదా పడిపోవడం పక్కా. అయితే ఎన్టీ రామారావు గారు బసవతారకం గారి వివాహ ఆహ్వాన పత్రిక గ్రాంథిక భాష లో వ్రాసి వుంది. వీళ్ళ పెండ్లి ఎక్కడ జరిగిందో తెలుసా..? వీళ్ళ పెళ్లి కొమరవోలు అనే గ్రామం లో జరిగింది అని శుభలేఖ లో వుంది.

వీరిద్దరూ 22-4-1942 న ఏడడుగులు వేశారు. గుడివాడ శ్రీ బాల సరస్వతి ప్రెస్ లో ఈ శుభలేఖ ని ప్రింట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే 1985లో బసవతారకం గారు కన్ను మూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యం తో ఆమె చనిపోయారు. ఆ తరవాత అన్నగారు తన భార్య బసవతారకం గారి గుర్తుగా ఓ క్యాన్సర్ హాస్పటల్ ని కట్టించారు.

Previous articleఫోటో ఛాలెంజ్ ఈ ఫొటోలో పవన్, చిరుల పక్కన ఉన్న వ్యక్తిని గుర్తు పట్టగలరా ?
Next articleతెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే బెస్ట్ పెయిర్ అనిపించుకున్న 14 జంటలు ఎవరో తెలుసా?