బేబీ మూవీ లో హీరోయిన్ ఫ్రెండ్ గురించి షాకింగ్ నిజాలు..

Ads

సరికొత్త సెన్సేషనల్ మూవీ బేబీ .జూలై 14న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో దూసుకు వెళ్తోంది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సంపాదించిన ఈ మూవీ లో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు వైష్ణవి చైతన్య లీడ్ రోల్స్ లో నటించారు. షార్ట్ అండ్ స్వీట్ టైటిల్ తో వచ్చిన ఈ చిత్రం అంచనాలను మించి ప్రేక్షకాదరణ పొందింది.

   

వినూతమైన కాన్సెప్ట్ తో ఆలోచింపచేసేలా రూపొందించిన ఈ చిత్రం వెనుక డైరెక్టర్ రియల్ లవ్ స్టోరీ ఉందని ఈమధ్య ఆయన పేర్కొనడం కూడా జరిగింది. ఈ చిత్రంతో ఆనంద్ దేవరకొండ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తన ఖాతాలో ఒక మంచి సాలిడ్ హిట్ వేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ చిత్రంలో హీరోయిన్ పక్కన ఆమె ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గురించి సోషల్ మీడియాలో బాగా హల్చల్ జరుగుతోంది.

Ads

వైష్ణవి చైతన్య ఈ మూవీలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది.ఈ మూవీలో వైష్ణవి చైతన్య ఫ్రెండ్ క్యారెక్టర్ లో కుసుమ డేగలమర్రి నటించింది.కుసుమ డేగలమర్రి మంచి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మరియు మోడల్ కూడా. యూట్యూబ్లో ప్రసారమయ్యే బిగ్ బాస్ హైదరాబాదీ స్పూఫ్ సీజన్ 1 అనే వీడియోస్ లో ఈమె నటించడం జరిగింది. అటు సోషల్ మీడియాలో కూడా కుసుమ యాక్టివ్ గా ఉంటారు.

తాను నటిస్తున్న ప్రకటనలు మరియు షూటింగులకు సంబంధించిన వీడియోస్ ,ఫోటోస్ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది కుసుమ. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్లో 12 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే క్రేజ్ ఏమాత్రం ఉందో ఆలోచించండి. బేబీ మూవీ కలెక్షన్స్ పరంగానే కాకుండా ఓటిటి మరియు శాటిలైట్ బిజినెస్ కూడా బాగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.

Previous articleక్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ కాంగ్రెస్ కి అధికారం ఖాయమా ?
Next articleరైలు “ట్రాక్” మారబోతుంది అని ఎలా తెలుస్తుంది.? ఎలా లోకో పైలెట్ స్లో చేస్తారు..?