రైలు “ట్రాక్” మారబోతుంది అని ఎలా తెలుస్తుంది.? ఎలా లోకో పైలెట్ స్లో చేస్తారు..?

Ads

రైలు ప్రయాణం చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి రైలు లో ప్రయాణం చేయడం అంటే ఎంతో ఇష్టం. రైలు లో వెళ్లడం సరదాగా ఉంటుంది. దూర ప్రయాణాలకు వెళ్లడానికి ఎంతో కంఫర్ట్ గా ఉంటుంది. అందుకనే చాలా మంది రైలు ప్రయాణాలని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేశంలో ఎక్కడికైనా సరే మనం రైలు లో వెళ్లి వచ్చేయొచ్చు.

రైలులో కిటికీ పక్కన కూర్చుని ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే సమయమే తెలియదు. లాంగ్ జర్నీ అయినా షార్ట్ జర్నీ అయినా సరే ట్రైన్ లో స్వీట్ గా ఉంటుంది.

అందుకే రోజూ రెండు లక్షల మంది రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే రైలు ఏ ప్లాట్ ఫార్మ్ మీద ఆగాలన్నా సరే ట్రాక్ మారాలి. ఈ విషయం మనకి తెలుసు. అయితే రైలు ఎలా ట్రాక్ ని మారుస్తుంది అనేది మనకి తెలియదు. మీరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా..? ట్రైన్ ట్రాక్ ని ఎలా మార్చుకుంటుందని… మరి దానికోసమే ఇప్పుడు చూసేద్దాం. రైలు ఎలా వెళ్తుంది. రైలు ట్రాకులు ఎలా మారుతాయి ఇటువంటి విషయాలని మనం పట్టించుకోము. కానీ తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక ట్రైన్ ట్రాక్ ని ఎలా మార్చుకుంటుంది అనేది చూస్తే.. ట్రాక్‌లపై, క్రాసింగ్‌ల వద్ద కొన్ని బోర్డ్స్ ని పెడతారు.

Ads

భారతీయ రైల్వే వాటిని ఏర్పాటు చేస్తుంది. వాటి ఆధారంగా లోకో పైలట్ ట్రైన్ ని నడుపుతారు. ట్రాక్ ని మార్చాల్సి వస్తే రెండు పసుపు రంగు సిగ్నల్స్ వేస్తారు. అప్పుడు సిగ్నల్ ని చూసి ట్రాక్ మారుస్తారు.
నెక్స్ట్ వచ్చే పసుపు సిగ్నల్ కి ట్రాక్ మారుతుందన్న విషయం లోకో పైలట్ కి తెలుస్తుంది. ఇలా ట్రైన్ స్పీడ్ ని లోకో పైలట్ ట్రాక్ మారేటప్పుడు తగ్గిస్తాడు. ముప్పై లోపు స్పీడ్ ఉండేలా చేస్తారు. అప్పుడు రైల్ రోడ్ స్విచ్ అనే మెకానిజం ద్వారా ట్రాక్ చేంజ్ అవుతుంది. లోకో పైలట్ ఏమి చెయ్యక్కర్లేదు. రెండు ట్రాక్ లను కలిపితే ఆటోమేటిక్ గా ట్రాక్ మారుతుంది. అదే విడిగా ఉన్నప్పుడు ట్రైన్ డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది.

Previous articleబేబీ మూవీ లో హీరోయిన్ ఫ్రెండ్ గురించి షాకింగ్ నిజాలు..
Next articleరిషబ్ శెట్టిలా ఈ 10 మంది హీరోలు కూడా దర్శలుకుగా సినిమాలు చేశారు..