మాల్స్‌లో బిల్లింగ్ దగ్గర మొబైల్ నెంబర్ ని తప్పకుండా ఇవ్వాలా..?

Ads

ఈ రోజుల్లో షాపింగ్ మాల్స్ ఎక్కువ అయిపోతున్నాయి. చాలామంది షాపింగ్ మాల్స్ కి వెళ్లి షాపింగ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా షాపింగ్ మాల్ కి వెళ్లే షాపింగ్ చేస్తూ ఉంటారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి… షాపింగ్ కి కానీ లేదంటే సూపర్ మార్కెట్ వంటి వాటికీ కానీ వెళ్ళినప్పుడు మనం షాపింగ్ చేసాక బిల్లింగ్ టైం లో ఫోన్ నెంబర్ ని అడుగుతారు.

మనం ఫోన్ నెంబర్ ఇస్తుంటాం. రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి కదా అని మనం ఫోన్ నెంబర్ ఇస్తాం. ఫోన్ నెంబర్ ఇవ్వడం వలన మోసపోయే అవకాశం ఉంటుంది. ఎలా మోసపోతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం… సాధారణంగా మనం బిల్లింగ్ టైం లో ఫోన్ నెంబర్ ఇస్తూ ఉంటాం ఆ ఫోన్ నెంబర్ కి మెసేజ్లు వస్తూ ఉంటాయి.

షాపింగ్ మాల్స్ తరపు వాళ్ళు వాట్సాప్ నెంబర్ కి మెసేజ్లను పంపుతుంటారు. ఆఫర్లు డిస్కౌంట్ వివరాలు కూడా మెసేజ్లు ద్వారా పంపిస్తూ ఉంటారు. ఇదంతా ఓకే కానీ మనకి ఒక్కోసారి స్పామ్ కాల్స్ ఎక్కువగా వస్తాయి స్పామ్ మెసేజ్లు కూడా ఎక్కువ వస్తాయి. అటువంటి మెసేజ్లకి ఫోన్స్ కి మనం రెస్పాండ్ అయితే కచ్చితంగా మోసపోవాలి.

బ్యాంక్ ఖాతాలో డబ్బులు అన్ని కూడా అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మనకే తెలియని నెంబర్ నుండి విపరీతంగా కాల్స్ వస్తూ ఉంటాయి. నెంబర్ ఎవరిచ్చారు అని మనం ఆలోచిస్తూ ఉంటాము. నిజానికి వాళ్లకి ఆ ఫోన్ నెంబర్లు ఎలా వెళ్తాయి అంటే బల్క్ లో ఫోన్ నెంబర్లని వాళ్ళు కొంటూ ఉంటారు.

Ads

ఒక్కో నెంబర్ కి ఇంత అని కస్టమర్ నెంబర్లు తీసుకుంటూ ఉంటారు. షాపింగ్ మాల్స్ దగ్గరికి వెళ్లి ఫోన్ నెంబర్లను తీసుకుంటూ ఉంటారు ఈ కారణంగానే మనం షాపింగ్ మాల్స్ కి వెళ్ళినప్పుడు ఫోన్ నెంబర్ ని ఇవ్వకూడదు. ఫోన్ నెంబర్ ని ఇవ్వకపోతే బిల్లింగ్ చేయించడం అవ్వదని చెప్తూ ఉంటారు కానీ ఫోన్ నెంబర్లు చెప్పాల్సిన పనిలేదని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పింది.

షాపుల్లో కానీ బయట కానీ కస్టమర్ల నుండి ఫోన్ నెంబర్లను సేకరించకూడదని క్లియర్ గా చెప్పేసింది. అయితే ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే బిల్ అవ్వదని అంటారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం అన్యాయమైన నిర్బంధ వాణిజ్య పద్ధతి కిందకి ఇది వస్తుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు.

వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా రిటైల్ పరిశ్రమలు, ఇండస్ట్రీ ఛాంబర్స్ కి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వంటికి అడ్వైజరీ జారీ చేసారని అన్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కోసం కానీ లేదు అంటే బిల్లింగ్ టైం లో కానీ ఫోన్ నంబర్లు చెప్పడం అవసరం లేదని అన్నారు.

 

Previous articleదర్శకుడు తేజ: ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ… కానీ ఏమి తెలీనట్టు అలా…!
Next articleఆశిష్ విద్యార్థి లవ్ మ్యారేజ్ చేసుకున్న “రూపాలీ బరువ” ఎవరు అంటే..?