దర్శకుడు తేజ: ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ… కానీ ఏమి తెలీనట్టు అలా…!

Ads

దగ్గుబాటి అభిరామ్ అహింస సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గీతికా తివారీ ఈ సినిమాలో అభిరామ్ సరసన నటించబోతోంది. అయితే ప్రమోషన్స్ కార్యక్రమాల తో బిజీ అవ్వడం తో తేజా వరుసగా ఇంటర్వ్యూలని ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా కూడా దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రశ్న ఆయనకి ఎదురు అవుతోంది.

తాజాగా ఇంటర్వ్యూ లో ఉదయ్ కిరణ్ పేరు రాగానే పాపమన్నాడు తేజ. అయితే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఒక హీరో డెత్ మిస్టరీ రివీల్ చేస్తున్నారా అని అడిగాడు. దీనికి తేజ చాలా మందికి ఉదయ్ కిరణ్ మరణం వెనుక అసలు కారణం తెలుసు కానీ నాతో చెప్పించాలని భావిస్తున్నారు అని అన్నారు తేజ.

Ads

పైగా అందరూ ఏమీ తెలియనట్టు అమాయకంగా ఉంటున్నారని వాళ్ళందరూ ఎందుకు అలా నటిస్తున్నారనేది తనకి తెలియడం లేదని చెప్పుకొచ్చారు తేజ. ఇది ఇలా ఉంటే తన ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాడు తేజ. మా అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడని త్వరలో హీరోగా పరిచయం చేయబోతున్నానని చెప్పాడు. ఇక వాళ్ళ అమ్మాయి గురించి చెబుతూ తన చదువు పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చిందని పెళ్లి చెయ్యను అని తేజ చెప్పారు.

అలానే తనకి నచ్చిన వాడిని మాత్రమే తాను పెళ్లి చేసుకుంటుందని తనే నచ్చిన వాడిని చూసి పెళ్లి చేసుకుంటుందని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పానని తేజ చెప్పాడు. ఆ తర్వాత దగ్గర వాళ్ళని పిలిచి భోజనాలు పెడతామని చెప్పుకొచ్చారు తేజ. ఒకవేళ పెళ్లి తర్వాత నచ్చక పోతే విడాకులు ఇచ్చేయమని నా పిల్లలకి చెప్తానని జీవితంలో సంతోషంగా ఉండడం కోసం ఏం చేయాలని అనిపిస్తే అది చేయండి అని తన పిల్లలతో చెప్తానని తేజ చెప్పాడు. పక్క వాళ్ళ కోసం ఆలోచించద్దని పిల్లలతో చెప్తానని తేజ చెప్పుకొచ్చాడు.

Previous articleపెళ్లి చేసుకోకుండా ఇంకా ఒంటరిగా ఉన్న.. 10 మంది ప్రముఖులు..!
Next articleమాల్స్‌లో బిల్లింగ్ దగ్గర మొబైల్ నెంబర్ ని తప్పకుండా ఇవ్వాలా..?