సమంత, సిద్ధార్థ్ లు నటించిన ”జబర్దస్త్” సినిమా ఎందుకు వివాదాస్పదం అయ్యిందో తెలుసా?

Ads

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా చాలాకాలం నుండి సౌత్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఆమె కెరీర్ లో అగ్ర హీరోలందరితోను నటించింది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలతోను నటించి మెప్పించింది. అయితే కొద్ది నెలల నుండి సమంత తరచుగా వార్తల్లో ఉంటూనే ఉంది.

హీరో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నుండి సమంత ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతోంది. ఇక ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల గురించి ఒక టైమ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే సమంత నటించిన ఒక సినిమా అప్పట్లోనే వివాదాస్పదం అయ్యి వార్తల్లో నిలిచింది. ఆ సినిమా విడుదలై దాదాపు పదేళ్ళు కావస్తోంది. మరి ఆ సినిమా ఏమిటి? ఎందుకు ఆ సినిమా వివాదాస్పదం అయ్యిందో ఇప్పుడు చూద్దాం..సమంత నాగ చైతన్యను ప్రేమించక ముందు, హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో పడింది. ఇక వారి మధ్య ప్రేమ చాలాకాలం పాటు సాగింది. వీరిద్దరూ చాలా కాలంగా ఎంతగానో ప్రేమించుకున్నప్పటికి వివాదాల వల్ల విడిపోయారు. ఇక సమంత, సిద్దార్థ్ కలిసి ఉన్నప్పుడు నటించిన సినిమా జబర్డస్త్. ఈ సినిమా 2013లో రిలీజ్ అయ్యింది. నందిని రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాను ప్రకటించే సమయానికే సమంత, సిద్ధార్థ్ లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

Ads

ఇక ఈ మూవీ 2013లో ఫిబ్రవరి 22న విడుదలయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జబర్డస్త్ మూవీ, యష్ రాజ్ ఫీలిమ్స్ బ్యాండ్ భాజా భారత్ మూవీని కాపీ చేశారని ఆరోపణలు వచ్చాయి. యష్ రాజ్ ఫీలిమ్స్ సంస్థ ఇదే విషయం ఫై కోర్టుకు వెళ్ళింది. జబర్దస్త్ చిత్రంలోని చాలా సీన్స్ బ్యాండ్ బాజా భారత్ మూవీని పోలి ఉన్నట్టుగా గుర్తించిన కోర్టు ఆ సినిమా పై స్టే విధించింది. జబర్దస్త్ సినిమాని డబ్ కానీ, డివిడి, టీవీలలో టెలికాస్ట్ చేయకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది.
తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా దీనిపై యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ కోర్టు కూడా వెళ్ళింది. ఆ సమయంలో సిద్ధార్థ్, సమంతల ప్రేమ గురించి మీడియాలో హాట్ టాపిక్ అవడంతో, తరచుగా వారి పై వార్తలు వస్తుండేవీ. అంతేకాకుండా సమంత, సిద్ధార్థ్ లు కోలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. దాంతో తమిళ డైరెక్టర్ లింగుస్వామి జబర్దస్త్ చిత్రాన్ని తమిళంలో డుండుంపీపీ అనే పేరుతో డబ్ చేసి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఆయన ప్లాన్ కు అడ్డుకట్ట వేసింది. ఇక ఈ చిత్రం విడుదల అయిన కొద్ది కాలానికి సమంత, సిద్ధార్థ్ లు విడిపోయారు.

Also Read: వెంకటేష్ సినిమాలలో ‘రాజా’ అనే టైటిల్ తో వచ్చిన వాటిలో ఏ మూవీ ఫ్లాప్ అయ్యిందో తెలుసా?

Previous articleదర్శకుడు రాజ‌మౌళి తల్లి మెగాస్టార్ చిరంజీవికి బంధువు అవుతారని తెలుసా?
Next articleమెగాస్టార్ చిరంజీవి నటించిన ”అంజి” సినిమా ప్లాప్ అవడానికి గల కారణం ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.