అక్కినేని అఖిల్ పక్కన నటించి కెరీర్ ని కోల్పోయిన స్టార్ హీరోయిన్స్ !

Ads

అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నాగార్జున ఇండస్ట్రీ లోకి వచ్చి స్థిరపడ్డారు. నాగార్జున చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అగ్ర హీరోల్లో ఒకరుగా నిలిచారు నాగార్జున. అయితే నాగార్జున కొడుకులు అఖిల్, నాగచైతన్య ఇద్దరు కూడా సినిమాల్లో అంతలా రాణించలేకపోతున్నారు. నాగచైతన్య కాస్త గుర్తింపునైన తెచ్చుకున్నాడు కానీ అఖిల్ కి మంచి హిట్టు లభించలేదు.

అఖిల్ కి సినిమాలలో కలిసి రావడం లేదు. ఎంతగా ప్రయత్నం చేసినా కూడా మంచి హిట్ ని అందుకోలేకపోతున్నాడు.

చిన్నప్పుడు సిసింద్రీ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది కానీ హీరోగా మాత్రం కాస్త సెటిల్ అవ్వడానికి ఇబ్బందులు పడుతున్నాడు అఖిల్. పైగా అక్కినేని ఫ్యామిలీ పేరు చెప్తే కొంతమంది హీరోయిన్లు భయపడిపోతున్నారు దానికి కారణం అఖిల్. భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా అఖిల్ కి హిట్ రావడం లేదు. పైగా అఖిల్ తో నటిస్తున్న హీరోయిన్లు కూడా కెరియర్ లో ఇబ్బంది పడాల్సి వస్తోంది.

Ads

అఖిల్ కెరీర్ మొత్తం మీద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే చెప్పుకోదగ్గది. అయితే ఇది హిట్ అవ్వడానికే కారణం పూజ హెగ్డే ఏ ప్రధాన కారణం. ఎక్కువ శాతం క్రెడిట్ ఆమెకే ఇవ్వాలి. అఖిల్ తో నటిస్తే ఇక కెరియర్ లో సక్సెస్ అవలేమని హీరోయిన్లు భావిస్తున్నారు. ఇప్పటికి కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేశాడు అఖిల్.

అఖిల్ ఫస్ట్ సినిమా అఖిల్ టైటిల్ తో వచ్చింది. ఇందులో హీరోయిన్ గా సయేషా నటించింది. ఆ సినిమా తర్వాత ఆమెకి అవకాశాలు వస్తాయి అనుకున్నారు కానీ మళ్ళీ తెలుగులో ఆమె ఎక్కడా కనబడలేదు. తర్వాత హలో సినిమా వచ్చింది.

హలో లో హీరోయిన్ గా ప్రియదర్శిని నటించింది. ఆ సినిమా హిట్ అవ్వకపోవడంతో మళ్లీ కనపడలేదు ప్రియదర్శిని. ఇక మూడో సినిమా మిస్టర్ మజ్ను. ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటించింది. ఆ తర్వాత మళ్లీ ఆమె కూడా కనపడలేదు.

కేవలం హరిహర వీరమల్లు సినిమాలో మాత్రమే ఉంది. ఇక ఆఖరి సినిమా వచ్చేసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఇది అఖిల్ కెరీర్ లో ఫస్ట్ హిట్. ఆ సినిమాలో నటించిన పూజ కెరీర్ కూడా ఇప్పుడు ఏమీ బాగోలేదు. దీంతో హీరోయిన్స్ అంతా కూడా ఎక్కడా కనపడేమోమొ అని భయపడుతున్నారు.

Previous articleకేసీర్ 25 అరుదైన ఫోటోలు.. మీరు ఎప్పుడైనా చూసారా..?
Next articleభర్తలు దూరం అయినా… పెళ్లి చేసుకోని 10 నటీమణులు వీళ్ళే..!