“లెజెండ్ శరవణన్” నెక్స్ట్ సినిమాని ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా..? కారణం ఏంటంటే..?

Ads

ది లెజెండ్ సినిమాతో నటన రంగంలోకి అడుగు పెట్టిన వ్యాపారవేత్త శరవణన్. చెన్నైలో ది శరవణ స్టోర్స్ చాలా పాపులర్. దానికి సంబంధించిన ప్రకటనల్లో ఓనర్ శరవణన్ బాగా కనిపించేవారు. అలా ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత డైరెక్ట్ హీరోగా సినిమా చేశారు.

సినిమా ఎలా ఉన్నా కూడా దాని గురించి చాలా రోజులు మాట్లాడుకున్నారు. చాలా పాత సినిమాలన్నీ కలిపి మిక్సీలో వేసి తీసినట్టు ఉంది అని అన్నారు. సినిమాలో హీరోయిన్ గా నటించిన ఊర్వశి రౌతేలాకి 20 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడం అనేది పెద్ద ఎత్తున చర్చలకి దారి తీసింది.

heroine who rejected legend saravanan next movie

అయితే, శరవణన్ నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ ని అడిగితే రిజెక్ట్ చేశారు. ఆవిడ మరెవరో కాదు. నయనతార. ఈ సినిమా కోసం నయనతారని హీరోయిన్ పాత్రకి అడిగారు. అయితే నయనతార ఈ పాత్రని రిజెక్ట్ చేశారు. ఈ సినిమా కోసం నయనతారకి 100 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం. అయినా కూడా సినిమా చేయడానికి అంగీకరించలేదు. అందుకు  కారణం ఏంటి అంటే, నయనతార జవాన్ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నప్పుడు ఈ సినిమా ఆఫర్ వచ్చిందట.

Ads

దాంతో ఈ సినిమా రిజెక్ట్ చేశారు. అప్పటి నుండి ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఇంకా కొంత మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే శరవణన్ నెక్స్ట్ సినిమాలో దాదాపు ఆరుగురు హీరోయిన్లు ఉంటారు అనే వార్త వచ్చింది. అందులో మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం నయనతారని సంప్రదించి ఉంటారు అని అంటున్నారు. నయనతారని సంప్రదించారు అంటే పాత్రకి ప్రాముఖ్యత బానే ఉంటుంది.

కాబట్టి ఇప్పుడు అలాంటి పాత్ర కోసం మరొక స్టార్ హీరోయిన్ ని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ది లెజెండ్ సినిమా లాగానే ఈ సినిమా కోసం కూడా ఎంతో మంది ప్రముఖ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ పనిచేస్తారు. ది లెజెండ్ సినిమా వచ్చి సంవత్సరం అయ్యింది. అప్పటి నుండి శరవణన్ నెక్స్ట్ సినిమా స్టోరీకి సంబంధించి డిస్కషన్స్ జరిగాయి. ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుంది అని సమాచారం.

ALSO READ : 58 ఏళ్ల హీరోకి జోడిగా 36 ఏళ్ల సమంత..! ఎవరంటే..?

Previous articleటీచర్ కి తన హోంవర్క్ చూపించింది… కానీ అందులో ఈ అమ్మాయి ఏం రాసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Next articleసైలెంట్ గా OTT లోకి వచ్చేసిన ఈ మోహన్‌లాల్‌ సినిమా చూశారా..? దీని కథ ఏంటంటే..?