విక్రమార్కుడు లో రవితేజ కూతురు ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఎంత అందంగా ఉందో చూడండి.!

Ads

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు సినిమా 2006 లో రిలీజ్ అయింది. రవితేజ అనుష్క శెట్టి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ యాక్షన్ సినిమా అందరినీ బాగా ఆకట్టుకుంది. సర్వేశ్ మురారి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందించారు. రవితేజ డ్యూయల్ రోల్ చేసాడు ఈ సినిమాలో. అత్తిలి సత్తిబాబుగా దొంగ పాత్రని, విక్రమ్ రాథోడ్ గా పోలీస్ పాత్ర ని కూడా చేసాడు.

ఈ సినిమాలో రవి తేజ కూతురుగా ఓ పాప నటించింది. మీకు గుర్తుందా..? చిన్న పాప లాగ నటించిన ఆ అమ్మాయి పేరు నేహా తోట. విక్రమార్కుడు సినిమాలో నటించి ఆమె అందరినీ బాగానే ఆకట్టుకుంది. అత్తిలి సత్తిబాబు ఒక పెట్టె లో ఈ పాపని ఇంటికి తీసుకెళ్తాడు. బంగారం ఏమో అని ఆశ పడతాడు కానీ ఈ పాప బయటికి వస్తుంది.

Ads

పోలీసులు చేతు లో ఇరుక్కుపోతాడు. తర్వాత పాపని ఎక్కడికైనా పంపించాలని తీసుకెళ్తాడు… అలానే ఆమె చేతిలో ఉండే వాక్మెన్ ని కూడా పగలకొట్టేస్తాడు పాప ఏడుస్తూ అమ్మ పాట రావడం లేదు అంటుంది. ఇలాంటి సీన్స్ ని మనం ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సీన్స్ లో ఆమె కనపడుతుంది. ఈ పాప బాగా అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ పాప ఈ సినిమా ఏ కాక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో వచ్చిన రక్ష అనే సినిమాలో కూడా నటించింది.

ఈ చిన్నారి రక్ష మూవీ లో నటించి ఆమె నటన తో అందరిని భయ పెట్టేసింది. అయితే తాజాగా నేహా తోటకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈమె సినిమాలేమి ప్రస్తుతం చేయడం లేదు. ఇప్పుడు ఈమె సినిమాలకు దూరమైంది. చదువు కోసమే సినిమాలకి దూరమైంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆ పిక్స్ ని మీరూ చూసేయండి.

Previous article“పుష్ప” లాగే “నెగిటివ్ టాక్”తో హిట్ ని అందుకున్న 7 సినిమాలు.!
Next articleస్టార్ హీరోలతో సినిమాలు…సినిమా సూపర్ హిట్..!! కానీ ఈ హీరోయిన్ల కెరీర్ మాత్రం ఫ్లాపేనా.?