నాని “సరిపోదా శనివారం” టీజర్‌లో ఈ సీన్ గమనించారా..? ఆ సినిమా గుర్తొస్తోంది ఏంటి..?

Ads

నాచురల్ స్టార్ నాని ఇవాళ తన 40వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఒక పాత్రకి, మరొక పాత్రకి సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న స్క్రిప్ట్ లు ఎంచుకుంటూ, నేచురల్ స్టార్ గా ఎదిగారు. హీరో అవ్వాలి అంటే కావాల్సింది బ్యాక్ గ్రౌండ్ కాదు, టాలెంట్ అని నిరూపించిన వారిలో నాని కూడా ఒకరు.

గత సంవత్సరం నాని దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ఈ సినిమాలు రెండు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు ఈ సంవత్సరం నాని సరిపోదా శనివారం సినిమాతో పలకరిస్తున్నారు. అంటే సుందరానికి కాంబినేషన్ లోనే ఈ సినిమా రూపొందుతోంది.

scene in nani saripodhaa sanivaaram teaser

అంటే, ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి అంతకుముందు గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించారు. ఎస్ జె సూర్య సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా టీజర్ ఇవాళ విడుదల చేశారు. ఈ సినిమాలో నాని ఒక సూపర్ హీరో పాత్రలో నటిస్తారు అనే వార్త వినిపిస్తోంది.  నాని సినిమాలో సూర్య అనే ఒక వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు.

scene in nani saripodhaa sanivaaram teaser

వారం అంతా తనకి జరిగిన సంఘటనలని, లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టిన వారిని గుర్తుంచుకొని, శనివారం వారికి గుణపాఠం చెప్తారు నాని. అయితే ఈ సినిమాలో నాని ఒక డైరీ రాస్తున్నట్టు చూపించారు.  ఆ డైరీ ని సరిగ్గా పరిశీలిస్తే, అందులో నాని కొంత మంది పేర్లు, వాళ్ళు చేసిన పనులు రాశారు. ఒకసారి ఆ డైరీ చూస్తే, అందులో, “ముత్యాల రావు-పాన్ పరాగ్ నమిలాడు, TS08BK4481- సిగ్నల్ జంప్ అటు నుండి వస్తున్న వాళ్ళని గుద్ధబోయాడు, రాజు – కార్ రివర్స్ చేస్తూ నా బైక్ ని గుద్ది కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు” అని రాసి, నారాయణ ప్రభ అనే ఒక మనిషి పేరు మీద సర్కిల్ చేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది.

Ads

guess the hero by picture

సూర్య, తను ఆల్రెడీ కొట్టిన వాళ్ళ పేర్లని బ్లూ కలర్ పెన్సిల్ తో కట్ చేసేసి, ఎవరితో అయితే డీల్ చెయ్యాలో ఆ వ్యక్తి పేరుని రెడ్ కలర్ పెన్సిల్ తో సర్కిల్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, ఈ నారాయణ ప్రభ ఎవరు అనేది మాత్రం తెలియదు. ఒకవేళ అది ఎస్ జె సూర్య అయినా అయ్యి ఉండొచ్చు. ఈ సినిమాలో ఎస్ జె సూర్య పోలీస్ పాత్రలో నటిస్తారు అని అర్థం అవుతోంది. కానీ కొంచెం అపరిచితుడు సినిమా షేడ్స్ కూడా కనిపిస్తున్నాయి.

scene in nani saripodhaa sanivaaram teaser

హీరో కూడా ఇలా డైరీలో రాసుకోకపోయినా కూడా, ఇబ్బంది పెట్టిన వాళ్ళని గుర్తు పెట్టుకోవడం, వాళ్లని శిక్షించడం చేస్తాడు. కాబట్టి ఇది సడన్ గా చూస్తే అలాగే ఉంది. కానీ స్టోరీ డిఫరెంట్ గా ఉండే అవకాశం కూడా గట్టిగానే ఉంది. అది టీజర్ చూస్తేనే అర్థం అవుతుంది. టీజర్ లో చూపించిన డిటైలింగ్ మాత్రం బాగుంది. సినిమా మీద ఇంకా ఆసక్తిని పెంచింది. మరి సినిమాలో ఎలాంటి విషయాలని చూపించబోతున్నారో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.

watch teaser :

ALSO READ : అజ్ఞాతవాసి “పవన్ కళ్యాణ్” నుండి… లైగర్ “విజయ్ దేవరకొండ” వరకు… ఇటీవలి కాలంలో ప్రేక్షకులకి చిరాకు తెప్పించిన 10 హీరో పాత్రలు..!

Previous article68 ఏళ్ల చిరంజీవి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు… ఒకరికి 35… ఒకరికి 30..! ఇదెలా సాధ్యం..?
Next article“బండారు సత్యనారాయణమూర్తి” తో పాటు… TDP తొలి జాబితాలో సీటు దక్కని తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులు వీరే..!