ఎట్టకేలకి OTT లోకి వచ్చేసిన ఈ సంవత్సరం బెస్ట్ సినిమా..! ఎందులో చూడాలి అంటే..!

Ads

థియేటర్లలో సినిమాలు వచ్చిన కొద్ది రోజులకి ఓటీటీలో వచ్చేస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో చాలా పెద్ద హిట్ అయ్యి, మంచి టాక్ సంపాదించుకుంటాయి. అలాంటి సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయి అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఒక సినిమా ఇటీవల విడుదల అయ్యింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్ చేసి విడుదల చేశారు.

manjummel boys review

తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. నిజజీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. సినిమా నిడివి తక్కువగానే ఉంటుంది. కానీ సినిమా రూపొందించిన విధానం మాత్రం చాలా బాగుంది. ఆ సినిమా పేరు మంజుమ్మల్ బాయ్స్. గత ఆదివారం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోకి వచ్చింది. కొంతbమంది యువకులు గుణ సినిమా ద్వారా ఫేమస్ అయిన గుణ కేవ్ లోకి వెళ్తారు. కానీ ఆ కేవ్ లోకి వెళ్లడం ప్రమాదకరం. వాళ్ళు వెళ్ళాక ఎటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారు అనేది మిగిలిన కథ. సినిమా సింపుల్ గా ఇదే పాయింట్ మీద మొదటి నుండి చివరి వరకు నడుస్తుంది.

Ads

సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలు మన దగ్గర రావడం తక్కువ. ఇది కూడా ఆ జానర్ లోకి చెందినది. చిదంబరం ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మలయాళం లోనే ఎక్కువ కలెక్షన్స్ సంపాదించిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. 2006 లో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. నిజ జీవితంలో ఈ సంఘటన ఎదుర్కొన్న స్నేహితులని కూడా సినిమా చివరిలో చూపిస్తారు.

సాధారణంగా ఇలాంటి కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలకి చాలా సినిమాల్లో కొన్ని కమర్షియల్ అంశాలని యాడ్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అది ఏదీ లేకుండా ఒకటే విషయం మీద సినిమాని నడిపించారు. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. కొన్ని సీన్స్ చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి. అందుకే సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సినిమాలో నటించిన నటుల యాక్టింగ్ చాలా ఎమోషనల్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Previous article3 కోట్లు పెట్టి తీసిన సినిమా… 70 కోట్లు వసూలు చేసింది..! అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?
Next articleఈ ఫోటోలో మహేష్ బాబు పక్కన ఉన్న వ్యక్తి ఇప్పుడు చాలా పెద్ద హీరో అయ్యారు..! ఎవరో కనిపెట్టగలరా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.