3 కోట్లు పెట్టి తీసిన సినిమా… 70 కోట్లు వసూలు చేసింది..! అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?

Ads

కొన్ని సినిమాలను నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తుంటారు. ఆ చిత్రాలు సంచలన విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ‘రోమాంచమ్’ మూవీ కూడా ఒకటి. హారర్ కామెడీ మూవీగా మలయాళంలో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ఘన విజయం సాధించింది. రీసెంట్ గా ఓటీటీలో తెలుగు డబ్బింగ్ తో విడుదల చేశారు. హారర్ కామెడీ జోనర్ లో ఇప్పటివరకు చాలా చిత్రాలు వచ్చాయి.

movie which collected 70 crores

 

అలా వచ్చిన చాలా చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే ‘రోమాంచమ్’ సినిమా రియల్ లైఫ్ లో జరిగిన ఘటనల ఆధారంగా తీశారని టాక్. మరి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..ఇటీవల మలయాళంలో రిలీజ్ అయిన ‘రోమాంచమ్’  సినిమా థియేటర్లకు ఆడియెన్స్ పరుగులు పెట్టేలా చేసింది. ఈ చిత్ర దర్శకుడు సినిమా నిజమైన సంఘటనల ఆధారంగా తీసినట్లు చెప్పారు.  ఏడుగురు బ్యాచిలర్ మిత్రులు కలిసి ఒక ఇంట్లో ఉంటారు.తలో పని చేస్తూంటారు.

Ads

 

వారిలో ఒకరు వేరే ఫ్రెండ్ ఇంట్లో ఆడే ‘ఓజో బోర్డు’ గేమ్ చూసి, తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంట్లో ఓజో గేమ్ స్టార్ట్ చేస్తాడు. దెయ్యాన్ని పిలుస్తారు. మొదట్లో ఫన్నీగా ఉంటుంది. కానీ ఆ తరువాత ఆ ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్ తో దెయ్యాన్ని పంపిస్తే అది వెళ్ళను అనడంతో ‘ఓజో బోర్డు’ పక్కన పెడతారు. ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఫ్రెండ్ వల్ల ఇబ్బంది పడతారు. ఫైనల్ గా ఆ ఇంట్లో దెయ్యం ఉందని ఖాళీ చేస్తారు. ఈ మూవీ 60 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.

 

ఇక ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో తీశారు. ఆ సంఘటనలు ఈ మూవీ డైరెక్టర్ జితు మాధవన్ రియల్ లైఫ్ లోనే జరిగాయి. ఆ విషయన్ని ఆయనే తెలిపారు. జితు మాధవన్ ‘అవును, ఇది నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన మూవీ. ఇది జరిగినప్పుడు భయంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే మాత్రం ఫన్నీగా అనిపిస్తోంది’ అని చెప్పారు.

 

ఇక ఈ చిత్రం చివర్లో ఒక ఫోటోను చూపిస్తారు. ఆ ఫోటోలో మూవీలోని ఏడుగురు ఫ్రెండ్స్ ఇంటి గోడ పైన కూర్చున్న ఫొటో ఉండగా దాని కిందే మరో ఏడుగురు ఫ్రెండ్స్ ఉన్న ఫొటోను చూపించారు. అందులో ఉన్న  ఏడుగురిలో ఈ మూవీ దర్శకుడు జితు మాధవన్ ఉన్నారు. ఈ మూవీ చూసిన చాలా మంది ఓజో బోర్డు మరియు రోమాంచమ్ నిజమైన ఇంటి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా..?

Previous articleఒకే ఒక్క సంఘటన భర్త మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చేసింది..! అతను ఏం చేశాడంటే..?
Next articleఎట్టకేలకి OTT లోకి వచ్చేసిన ఈ సంవత్సరం బెస్ట్ సినిమా..! ఎందులో చూడాలి అంటే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.