ఐపీఎల్ చరిత్ర లో టాప్ 10 హీటెడ్ మూమెంట్స్..!

Ads

మన భారత దేశంలో క్రికెట్ అభిమానులు ఎంతోమంది ఉన్నారు. క్రికెట్ ని చూడడం ఆడడం కూడా చాలా మందికి ఎంతో ఇష్టం. ఐపీఎల్ మ్యాచ్లు అయితే చాలా సస్పెన్స్ గా ఉంటాయి. ఆఖరి బంతి వరకు కూడా మనం గెలుపు కోసం ఎదురు చూడాలి. ఐపీఎల్ చరిత్రలో మ్యాచ్ జరిగే సమయంలో ఆటగాళ్ల మధ్య విభేదాలు రావడం గొడవ పడడం వంటివి చాలానే చోటుచేసుకున్నాయి. మరి వాటి కోసం ఈరోజు చూద్దాం. ఇటీవల కోహ్లీ గంభీర్ గొడవ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. అలా క్రికెటర్ల మధ్య గొడవపడ్డ సందర్భాలు ఐపీఎల్ చరిత్రలో ఎనో ఉన్నాయి. ఓ లుక్ వేసేయండి మరి.

  1. శ్రీశాంత్ Vs హర్భజన్ సింగ్ – MI Vs KXIP 2008

హర్భజన్ సింగ్ శ్రీకాంత్ ని చెంప దెబ్బ కొట్టాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్భజన్ సింగ్ శ్రీకాంత్ బౌలింగ్ చేస్తున్నప్పుడు తన ప్రశాంతతని కోల్పోయాడు. అతన్ని చెంప మీద కొట్టాడు మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీకాంత్ ని హర్భజన్ సింగ్ కౌగలించుకున్నాడు. గొడవని కంట్రోల్ చేసేందుకు చూశాడు. కానీ శ్రీకాంత్ కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యాడు. తర్వాత బజ్జీ శ్రీకాంత్ కి సారీ చెప్పాడు.

2. గంభీర్ Vs కోహ్లీ – KKR Vs RCB 2013

విరాట్ కోహ్లీ కి కొంచెం కోపం ఎక్కువే. అయితే ఒకసారి తన ప్రశాంతతనీ కోల్పోయి ఐపీఎల్ మ్యాచ్ సందర్భంలోనే గంభీర్ మీద కోప్పడ్డాడు. 2013లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంలో కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మీద ఆగ్రహానికి గురవ్వగా అతను కూడా ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో వాళ్ళ మధ్య ఫైట్ జరిగింది. ఆ తర్వాత ఎంపైర్ వాళ్ళని వేరు చేశారు.

3. 2019లో MS ధోని Vs రాజస్థాన్ రాయల్స్, అంపైర్లు:

ఎంఎస్ ధోని ఎంత ప్రశాంతంగా ఉంటాడో మనకి తెలుసు కానీ 2019లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగే సందర్భంలో ఎంపైర్ నో బాల్ గా ప్రకటించారు. అయితే ధోని అప్పుడు ఆగ్రహానికి గురయ్యాడు. ఎంపైర్ల వద్దకి వెళ్ళాడు. బెంజ్ స్ట్రోక్ కూడా చర్చలో చేరాడు ఇలా వాగ్వాదానికి దారితీసింది.

4. కీరాన్ పొలార్డ్ Vs మిచెల్ స్టార్క్ – MI Vs RCB 2014

Ads

2014లో పొలార్డ్ మరియు మిచెల్ స్టార్కు మధ్య చిన్న గొడవ జరిగింది బ్యాటింగ్ చేయడానికి రెడీగా లేడు పోలార్డ్. కోపంతో బౌలింగ్ చేస్తున్న స్టార్క్ మీద బ్యాట్ ఎత్తాడు. వీళ్ళిద్దరి మధ్య అక్కడ గ్రౌండ్లో ఇలా చిన్న గొడవ జరిగింది.

5. అంబటి రాయుడు Vs హర్భజన్ – MI Vs RPS 2016

అంబటి రాయుడు హర్భజన్ సింగ్ మధ్య కూడా ఓ రోజు చిన్న ఫైట్ జరిగింది. హర్భజన్ రాయుడు ఫీల్డింగ్ నచ్చక రాయుడు మీద గ్రౌండ్ లోనే అరిచాడు. తర్వాత రాయుడు కూడా హర్భజన్ మీద కేకలేశాడు.

6. సౌరవ్ గంగూలీ Vs షేన్ వార్న్ – KKR Vs RR 2008

సౌరవ్ గంగూలీ 2008లో క్యాచ్ అవుట్ నిర్ణయం మీద కోప్పడి ఎంపైర్లతో వాదించడం మొదలుపెట్టాడు. ఆర్ఆర్ కెప్టెన్ షైన్ వార్నీ ఆ గొడవలో చేరి మాట్లాడటం మొదలుపెట్టాడు ఇలా వీళ్ళ మధ్య కాస్త మాటలు యుద్ధం జరిగింది.

7. నితీష్ రానా Vs హృతిక్ షోకీన్ – KKR Vs MI

ఈ మధ్య నితీష్ రానా, హృతిక్ షోకీన్ కి గొడవ అయింది. కెప్టెన్ మీద కొంచెం యాటిట్యూడ్ చూపించాడు షోకిన్.

8. కోహ్లి Vs అశ్విన్ – RCB Vs KXIP 2019

కోహ్లీ అశ్విన్ మధ్య కూడా 2019లో ఒక చిన్న గొడవ జరిగింది. కోహ్లీని అశ్విన్ అవుట్ చేశాడు కోహ్లీ కాస్త ఆగ్రహానికి గురయ్యాడు. తర్వాత అశ్విన్ కూడా కొన్ని మాటలు అన్నాడు.

9. గంభీర్ Vs రాహుల్ ద్రవిడ్ – KKR vs RR 2013

రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వాట్సన్ 2013లో కేకేఆర్ ప్లేయర్ బిస్లా మీద కామెంట్లు చేసాడు. తర్వాత కేకేఆర్ కెప్టెన్ కి కోపం వచ్చింది. దాంతో కొన్ని మాటలు అన్నాడు. తర్వాత రాహుల్ ద్రావిడ్ కూడా ఇందులో చేరాడు ఇలా మొత్తం ఆర్గ్యుమెంట్ అయింది.

10. కోహ్లి Vs గంభీర్ & నవీన్-ఉల్-హక్- RCB Vs LSG 2023

ఇటీవల జరిగిన ఒక మ్యాచ్ లో, కోహ్లి ఎల్‌ఎస్‌జి ఆటగాళ్లను దూకుడుగా ఔట్ చేయగా కోహ్లి గంభీర్ మధ్య డిస్కషన్ జరిగింది. కోహ్లి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నవీన్-ఉల్-హక్ వైపు దూకుడుగా చూడడం జరిగింది. మ్యాచ్ అయ్యాక కోహ్లితో గంభీర్ మాటల యుద్ధం స్టార్ట్ చేసాడు.

Previous articleRamabanam movie review: గోపీచంద్ హీరోగా నటించిన ”రామబాణం” స్టోరీ, రివ్యూ & రేటింగ్..!
Next articleమందు తాగిన వాళ్ళ కళ్ళు ఎందుకు ఎర్రగా ఉంటాయి.. కారణం ఏమిటి..?