ఈ ఫోటోలో ఉన్న క్యూట్ పాప…ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్! ఎవరో గుర్తుపట్టారా..?

Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూపోతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం భాషా భేదం లేకుండా పాతుకు పోతారు. అలా ప్రస్తుతం టాలీవుడ్ లో తెగ బిజీగా ఉన్న బ్యూటీ ఫోటోని మీరు చూస్తోంది. అమెరికాలో పుట్టి ,పక్క రాష్ట్రంలో పెరిగి ,టాలీవుడ్ చేరిన ఈ భామ ఇక్కడ ఆల్రెడీ పాతుకుపోయిన హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తోంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా…. శ్రీ లీల.

ఫోటో కాస్త పాతగా ఉన్నా ,దిగింది టీనేజ్ లో అయినా కొన్ని పోలికలు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ముఖ్యంగా నవ్వు చూస్తే టక్కున ఈ బ్యూటీ ఎవరో ఈజీగా తెలిసిపోతుంది. అవును మీరు అనుకుంది నిజమే ఆ ఫోటోలో కనిపిస్తున్న పాప మరెవరో కాదు క్యూటీ బేబీ. శ్రీ లీల. మొదట తన కెరీయర్ ఫ్లాప్ తో స్టార్ట్ అయినప్పటికీ ప్రస్తుతం రాకెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది ఈ హీరోయిన్.

Ads

పుట్టింది అమెరికా అయినా…తెలుగుతనం ఉట్టిపడే స్త్రీల పేరెంట్స్ డైవర్స్ తరువాత తల్లితోపాటు బెంగళూరులో పెరిగింది. చిన్నతనంలోనే శ్రీ లీల భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. మెల్లిగా కన్నడంలో హీరోయిన్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన శ్రీ లీల ‘పెళ్లి సందD’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

రెండో చిత్రం ధమాకా తో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.ముఖ్యంగా కుర్ర కారు శ్రీ లీల డాన్స్ అంటే పడి చచ్చిపోతారు. ప్రస్తుతం మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో లైనప్ లో ఉన్న శ్రీ లీల సినిమాలు విడుదల అయితే దీపావళి దగ్గర నుంచి సంక్రాంతి వరకు వరుసగా ప్రేక్షకులను పలకరిస్తాయి.

Previous articleఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్…ఇప్పుడు సైకాలజిస్ట్.! ఎవరో గుర్తుపట్టారా.?
Next articleబుల్లితెరపై దూసుకుపోతున్న టాప్ 5 సీరియల్ హీరోయిన్స్ వీళ్ళే…లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.