సుప్రీం కోర్టు: ప్రేమ వివాహాలలోనే విడాకులు ఎక్కువ…!

Ads

ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ వివాహాలే జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ కూడా ఈ రోజుల్లో ప్రేమించే పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇదే కాదు పద్దతి కూడా మారిపోయింది. ఇది వరకు ఒకసారి పెళ్లి అయిన తర్వాత ఎంతో ఆనందంగా వుండేవాళ్ళు.

కలిసిమెలిసి కలకాలం జీవించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చూస్తే పెళ్లయిన తర్వాత కలిసి నాలుగైదు ఏళ్ళు ఉండకుండానే విడిపోవడం ఏ మేలని చాలా మంది ఆవేశం లో నిర్ణయం తీసుకుంటున్నారు ఓపిక సహనాన్ని కోల్పోతున్నారు. ప్రేమ పెళ్లిళ్లైనా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు అయినా కూడా విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి.

కానీ ప్రేమ వివాహాలలోనే ఎక్కువగా విడాకులు అవుతున్నాయి. సుప్రీం కోర్ట్ ఈ ప్రేమ వివాహాల పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎక్కువగా ప్రేమ వివాహాల్లోనే విడాకులు జరుగుతున్నాయని చెప్పింది సుప్రీంకోర్టు. ఓ జంట తాజాగా సుప్రీంకోర్టుని ఆశ్రయించగా విడాకులు కావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

Ads

ఆ జంట మతం మారడానికి భార్య ఒప్పుకోవడం లేదని ఒక భర్త పిటిషన్ వేశాడు ఇద్దరినీ నచ్చజెప్పి పంపిస్తామని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఆ జంట ఒప్పుకోలేదు. దీంతో వాళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేసింది సుప్రీంకోర్టు. పెద్దలకు ఈ జంట కి విడాకులు ఇస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత జనరేషన్లో ప్రేమ వివాహాలు విపరీతంగా జరుగుతున్నాయని అంది.

ప్రేమ వివాహాలు చేసుకున్న వారే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నట్లు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు పెద్దల కుదుర్చున పెళ్లి తో పోల్చుకుంటే ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళే ఎక్కువగా కోర్టుకి వస్తున్నారని సుప్రీం కోర్టు చెప్పింది. ఒకవేళ కనుక భార్య భర్తలకి ఇద్దరికీ కూడా ఇష్టం లేకపోతే ఆరు నెలల కాల పరిమితి అనే రూల్ తో లింక్ కూడా లేదు. వాళ్లకి విడాకులు ఇవ్వచ్చని సెక్షన్లు కూడా ఉన్నట్లు చెప్పింది సుప్రీంకోర్టు.

Previous articleవిక్టరీ వెంకటేష్, రాజమౌళి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా ఇదే..!
Next articleపాండవుల మరణం తర్వాత…“ధర్మరాజు” మాత్రమే స్వర్గానికి వెళ్ళాడు ఎందుకు..?