ఊరి పేర్లతో వచ్చిన 20 సినిమాలు.. అందులో ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి?

Ads

ఒక మూవీ పై బజ్ ఏర్పడడానికి అందులో నటించే హీరో, హీరోయిన్లతో పాటుగా సినిమా టైటిల్ కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది. అయితే అలా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదో ఒక టైటిల్ పెట్టేస్తే సరిపోదు.

ఆ సినిమా స్టోరికి సంబంధించి లేదా సినిమాలోని హీరో, హీరోయిన్ల క్యారెక్టర్స్ కి చెందేట్టుగా దర్శకనిర్మాతలు సినిమాకి టైటిల్ పెడుతూ ఉంటారు. కొన్ని సినిమాలకు సంబంధం లేకుండా ఊరి పేర్లనే, సినిమా టైటిల్స్ గా పెట్టారు. అలా ఊరి పేర్లతో వచ్చిన సినిమాలు ఏమిటో, వాటి రిజల్ట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1) బొంబాయి :
మణిరత్నం దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ సినిమా బొంబాయి. ఈ సినిమాకి ఊరి పేరు పెట్టారు.
2) అరుణాచలం :
ఇది కూడా ఊరి పేరే. రజినీకాంత్ హీరోగా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది.

Ads

3) తెనాలి :
కమల్ హాసన్ నటించిన ఈ సినిమాకి తెనాలి అనే ఊరి పేరు పెట్టారు. అయితే తెలుగులో ఈ మూవీ ఆడలేదు.
4) అయోధ్య :
సూపర్ స్టార్ కృష్ణ, వడ్డే నవీన్ నటించిన ఈ మూవీకి ఆశించిన విజయం పొందలేదు. అయోధ్య శ్రీ రాముడి జన్మస్థలం పేరు.
5) భద్రాచలం :
ఎన్.శంకర్ డైరెక్షన్లో శ్రీహరి హీరోగా వచ్చిన ఈ మూవీకి ఊరి పేరు పెట్టారు. ఈ మూవీ హిట్ అందుకుంది.
6) శ్రీశైలం :
ఇది కూడా ఊరి పేరే. ఇందులో శ్రీహరి హీరోగా నటించారు.యావరేజ్ గా నిలిచింది. .
7) అనంతపురం :
తమిళ సినిమాని తెలుగులో డబ్ చేశారు. ఈ మూవీ నిరాశ పరిచింది.
8) హనుమాన్ జంక్షన్ :
ఇది కూడా ఊరి పేరే. అర్జున్, జగపతి బాబు, వేణు నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
9) గంగోత్రి :
అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి సినిమా. ఈ మూవీ హిట్ అయ్యింది.
10) అన్నవరం :
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా విజయం పొందలేదు.
11) బద్రీనాథ్ :
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
12) కేరాఫ్ కంచరపాలెం :
2018 లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
13)బెజవాడ :
నాగ చైతన్య హీరోగా వచ్చిన ఈ సినిమా విజయం పొందలేదు. విజయవాడ పాత పేరుని పెట్టారు.
14) భీమిలి కబడ్డీ జట్టు :
నాని హీరోగా వచ్చిన ఈ సినిమా విజయం పొందలేదు.
15) ద్వారక :
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
16) కులుమనాలి :
ఇందులో శశాంక్, విమల రామన్ నటించారు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
17) సింహాచలం :
శ్రీహరి హీరోగా వచ్చిన ఈ సినిమా యావేరేజ్ గా నిలిచింది.
18) రేణి గుంట :
ఇది ఊరు పేరుతో వచ్చిన సినిమా. కానీ విజయం పొందలేదు.
19) కాశీ :
జెడి చక్రవర్తి హీరోగా వచ్చిన ఈ సినిమా విజయం పొందలేదు.
20) తిరుపతి :
అజిత్ హీరోగా వచ్చిన డబ్బింగ్ సినిమాకి పుణ్యక్షేత్రమైన తిరుపతి పేరునే పెట్టారు. విజయం పొందలేదు.
Also Read: దర్శకధీరుడు రాజమౌళి నటించిన సినిమా ఏమిటో తెలుసా?

Previous articleవైరల్ అవుతున్న టెలివిజన్ సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు.. నాగబాబు పెళ్లి ఫోటోలు హైలెట్..!
Next articleక్లైమాక్స్ లో హీరో చనిపోవడం వల్ల అపజయం పొందిన సినిమాలు ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.