టాలీవుడ్ ని ఏలుతుంది అనుకున్నారు… కానీ ఫ్లాప్ హీరోయిన్ గా మిగిలిపోయింది..! కారణం ఏంటంటే..?

Ads

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోలు సంవత్సరాలు తరబడిన హీరోలు గానే ఉంటారు ..కానీ హీరోయిన్ లు మాత్రం తమ ఉనికి నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. వాళ్లకి అవకాశాలు రావడం కూడా ఎంతో కష్టమయ్యే సందర్భాలు ఉన్నాయి . అలాగని అవకాశం వచ్చిన ప్రతి హీరోయిన్స్ స్టార్ హీరోయిన్ అవుతుంది అన్న గ్యారెంటీ కూడా లేదు .

వరసగా ఒక రెండు మూడు హిట్లు పడితేనే ఎవరికైనా గుర్తింపు…అలాంటిది పొరపాటున ఒక ఫ్లాప్ ఎదురైనా చాలు ఇండస్ట్రీ నుంచి కనుమరుగవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. కొందరు హీరోయిన్ లు భారీ అంచనాల మధ్య మొదట వరుస హిట్లతో మంచి క్రేజ్ తెచ్చుకొని… ఆ తర్వాత సరియైన సినిమాలు లేక ఇబ్బంది పడేవారు ఉన్నారు.

what happened to this heroine

Ads

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీతిసింగ్ చాలా కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఆ తరవాత వరుసగా అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. కానీ ఆమె సినిమాలు ఊహించిన రేంజ్ లో హిట్ కాకపోవడంతో మెల్లిగా ఆమెకు సినిమాలో ఛాన్సులు ఇచ్చే వాళ్ళు కరువైపోయారు. దాంతో మెల్లిగా ఇండస్ట్రీ నుంచి ఫెడ్ అవుట్ అవుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ముంబైలో ఉంటుంది.

what happened to this heroine

దానికి తోడు గత సంవత్సరం డ్రగ్స్ కేసులో వినిపించిన సెలబ్రిటీస్ పేర్లలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది. దీంతో ఇప్పుడు అసలు తెలుగు ఇండస్ట్రీ వైపు చూడకుండా అక్కడే సినిమాలు చేస్తూ స్థిరపడిపోయింది. ఒకవేళ తెలుగులో మళ్లీ మంచి అవకాశం వస్తే చేస్తూందేమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆమెకు స్టార్ హీరోలు ఎవరు అవకాశం ఇచ్చే ఆస్కారం కనిపించడం లేదు.

Previous articleమహేష్ బాబు నుండి అకీరా నందన్ వరకు.. వీరి తండ్రులు ఒకరే కానీ తల్లులే వేరు..!
Next articleచిరంజీవికి-సురేఖకి మధ్య ఇన్ని సంవత్సరాల తేడా ఉందా..? వీరిద్దరికీ ఉన్న ఏజ్ గ్యాప్ కి ఎంతంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.