కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన వస్తువులు ఏం చేస్తారో మీకు తెలుసా?

Ads

ఎక్కవగా విమానాలలో ప్రయాణించినప్పుడు తప్పనిసరిగా కస్టమ్స్ వారు మన సామాన్లు తనిఖీ చేస్తారు. అలాంటి సమయంలో మన దగ్గర ఏదైనా కానీ ఉండకూడని వస్తువు ఉన్నట్లు వారు భావిస్తే వాటిని స్వాధీన పరచుకుంటారు. అయితే ఇలా స్వాధీన పరచుకున్న వస్తువులను వాళ్లు ఏం చేస్తారు అన్న విషయం మనలో చాలామందికి తెలియదు.

కస్టమ్స్ అధికారులు సీజ్ చేసిన వస్తువులను ఏం చేస్తారు అన్న విషయం వాటి స్వభావం మరియు సీజ్ చేయడానికి గల కారణాల మీద ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా ఎవరి దగ్గర అయితే వస్తువులను స్వాధీనపరచుకున్నారో ,ఆ యజమాని ఏదన్నా చట్టాన్ని ఉల్లంఘించాడా లేదా అన్న విషయాన్ని కూడా పరిగణించడం జరుగుతుంది.

Ads

అలా స్వాధీనపరచుకున్న వస్తువులలో కొన్నిటిని భద్రపరిస్తారు మరికొన్నిటిని వేలం వేస్తారు, ఇంకొన్నిటిని డిస్పోస్ చేస్తారు. స్వాధీన పరుచుకున్న వస్తువుల్లో ఏవైనా భారతీయ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోకి తీసుకురాబడినట్లు అయితే వాటిని ఆ తర్వాత డేస్త్రాయ్ చేస్తారు. డ్రగ్స్ మరియు మరణాయుధాలు లాంటివి తీసుకువచ్చిన వారి దగ్గర నుంచి వాటిని స్వాధీన పరచుకోవడమే కాకుండా కోర్టు ద్వారా వాళ్లకు పెనాల్టీని కూడా విధించడం జరుగుతుంది.

అంతేకాకుండా ఇన్ కరక్ట్ డాక్యుమెంటేషన్ లేక అండర్ వాల్యుయేషన్ ఉన్న వస్తువులను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ వస్తువుల యొక్క యజమాని నిర్దిష్ట సమయంలో డబ్బులు చెల్లించి ఆ వస్తువులను తీసుకోవచ్చు అలా కాని పక్షంలో వాటిని వేలం వేయడం జరుగుతుంది. ఇది కాకుండా బంగారం మరియు డబ్బులు లాంటివి దొరికితే వాటిని ప్రభుత్వ బ్యాంకుల్లో భద్రపరుస్తారు.

Previous articleవిశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదలైన ‘పేక మేడలు’ టీజర్
Next articleరద్దు చేసిన పాత నోట్లను ఆర్బిఐ ఏం చేస్తుందో తెలుసా?