హెయిర్ డ్రైయర్ లు ఇస్త్రీ పెట్టెలు కాదు… శ్రీలంక బోర్డుని చూసైనా మన BCCI నేర్చుకుంటే బాగుంటది.?

Ads

ప్రపంచంలో రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా పేరు తప్ప…బీసీసీఐ ఒరగబెట్టింది ఏమీ లేదు. స్టేడియంలో కల్పిస్తున్న వసతులు, అక్కడ ఉన్న సీట్ల పరిస్థితులు…ఎప్పటినుంచో రన్ అవ్వకుండా మూతపడ్డ పాత సినిమా థియేటర్ల కంటే వరస్ట్ గా ఉన్నాయి.

తాజాగా ఆసియా కప్ 2023 టోర్నీ లో జరిగిన కొన్ని సంఘటనల తర్వాత బీసీసీఐ మరోసారి తీవ్ర విమర్శలకు గురి అవుతోంది.

bcci

ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా పాకిస్తాన్లో జరిగిన అన్ని మ్యాచ్లు ఒక మోస్తారు గానే జరిగాయి. అయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ మాత్రం కొన్ని సాంకేతిక కారణాల వల్ల పావుగంట ఆగిపోయింది. లాహోర్ స్టేడియంలోని ఒక ఫ్లడ్ లైట్ పనిచేయకపోవడం వల్ల ఆటకు అంతరాయం ఏర్పడింది. దీనికి కారణం ఏ పవర్ కటో లేక లైన్ రిపేరో కాదు..పాక్ క్రికెట్ బోర్డు, లాహోర్ ఎలక్ట్రిసిటీ బోర్డుకు బకాయిలు కట్టకపోవడం తో వాళ్లు మంచి టైమింగ్ చూసి కరెంటు తీసేశారు.

Ads

this player for world cup

చివరికి పావు వంతు బకాయిలు చెల్లించాక పావుగంటలో పవర్ సప్లై ప్రొవైడ్ చేశారు. ఇంత ధ్వనంగా ఉన్న పార్క్ క్రికెట్ బోర్డు సైతం సూపర్ లీగ్ లో ఇచ్చిన ఆరబెట్టడం కోసం కేజిఎఫ్ లో హీరోయిన్ కోసం హీరోన్ కోసం వాడినట్టు హెలికాప్టర్ ని వాడింది. ఆ ఫోటోని చూసి లక్షల కోట్ల బ్రాండ్ వాల్యూ ఉన్న ఐపిఎల్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మరోపక్క 43 వేల కోట్లు ఒక్క ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారానే ఖాతాలో వేసుకున్న బీసీసీఐ మాత్రం గ్రౌండ్లో అవుట్ ఫీల్డ్ ఆరబెట్టడం కోసం హెయిర్ డ్రైయర్లు, ఇస్త్రీ పెట్టెలు వాడింది.

ఆర్థిక మాన్యంతో బాధపడే శ్రీలంక సైతం అవుట్ ఫీల్డ్ ఆరబెట్టడం కోసం బీసీసీఐ కంటే అది నాతర పద్ధతులను వాడింది. వచ్చే నెల ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలలో కూడా ఇదే రకమైన పనులు చేస్తే బీసీసీఐ పరువు పోవడం ఖాయం అని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Previous articleచంద్రబాబు కేసు వాదించే లాయర్ ఎవరో తెలుసా.? గతంలో ఆయన వాదించిన కేసులు ఏంటంటే.?
Next articleచంద్రబాబు నాయుడు అరెస్ట్ కేసులో “లాయర్ లూథ్రా” వేసిన ప్రశ్నలు ఇవే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.