ఆర్మీ సైనికులు జుట్టుని ఎందుకు కత్తిరించుకోవాలి..? కారణం ఏమిటి..?

Ads

ఎప్పుడైనా ఆర్మీ సైనికులని గమనించినట్లయితే వాళ్ల జుట్టు చాలా పొట్టిగా కత్తిరించి ఉంటుంది. ఎప్పుడూ కూడా పొడవు జుట్టుతో ఆర్మీ వాళ్ళు మనకు కనపడరు అయితే ఎందుకు ఆర్మీ సైనికులు జుట్టుని పొట్టుగా కత్తిరించుకోవాలి..? ఆర్మీ సైనికులు జుట్టును ఎందుకు పెంచుకోకూడదు..? దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

సహజంగా ఏ ఆర్మీ సైనికుడిని చూసినా వాళ్ళు జుట్టు పొట్టికి గా కత్తిరించి ఉంటుంది పొడవాటి జుట్టుతో మనకి ఎవరూ కనపడరు. అయితే నిజానికి ఆర్మీ సైనికులు పొట్టిగా జుట్టును కత్తిరించుకోవాలి అని రూల్ కూడా ఉంది. అయితే దీని వెనక ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కారణాలు ఉన్నాయి మరి అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం..

Ads

  • సైనికులకి చాలా పనులు ఉంటాయి ఇలాంటి పనులు ఉన్నప్పుడు జుట్టుని మెయింటైన్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అదే జుట్టు పొట్టిగా కత్తిరించబడి ఉంటే ఈజీగా జుట్టుని దువ్వుకోవచ్చు. అలానే పొట్టి జుట్టు కి శ్రద్ద పెట్టక్కర్లేదు కూడా.
  • అలానే ప్రజలకి సమానత్వ భావం కలుగుతుంది అందరూ చూడడానికి ఒకేలా కనపడతారు ప్రత్యేకంగా ఎవరూ కనపడరు. చూడడానికి ఒకేలా ఉంటారు.
  • పైగా పొట్టి జుట్టు ఉండడం వలన స్నానం చేసిన వెంటనే ఆరిపోతుంది ఎక్కువ సమయం జుట్టు కోసం వెచ్చించక్కర్లేదు. వర్షంలో యుద్ధం కి వెళ్లాలన్న నీటిలో ఈదుతూ వెళ్లాలన్న ఏ అడ్డంకులు ఉండవు. సులభంగా వాళ్ళ యొక్క పని మీద ఏకాగ్రతను పెట్టొచ్చు. 
  • పైగా ఆపరేషన్ సమయంలో వాళ్ళకి హెల్మెట్ ని ఇస్తారు ఆర్మీ సైనికులు హెల్మెట్ ని ధరించాల్సి ఉంటుంది. జుట్టు పొడుగ్గా ఉంటే ఆ హెల్మెట్ ని ధరించడం కుదరదు ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.
  • పైగా పొట్టి జుట్టు కలిగి ఉండడం వలన చల్లగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. 
  • అలానే ఎప్పుడూ కూడా ఆర్మీలో పని చేసే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉండాల్సి ఉంటుంది పేలు ఇటువంటివి ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళకి కలగొచ్చు అదే పొట్టిగా జుట్టుని కత్తిరించుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవు.
Previous articleవాట్సాప్‌ చాట్‌ ఇతరులకు కనిపించకూడదా..? అయితే ఈ ఫీచర్ ని చూడండి..!
Next articleచిప్స్ మీద గీతలు ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?