చిప్స్ మీద గీతలు ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?

Ads

చాలా మంది ఖాళీ సమయం దొరికినప్పుడు చిప్స్ వంటివి తింటూ ఉంటారు. ఆకలి వేసినా వేయకపోయినా చాలా మంది టీవీ చూస్తూ చిప్స్ వంటివి తీసుకుంటూ ఉంటారు. ఈరోజు చిప్స్ గురించి చాలా మందికి తెలియని ఫ్యాక్ట్స్ ని చూద్దాం.. చిప్స్ ని చూసినట్లయితే వాటి మీద జిగ్ జాగ్ లైన్స్ ఉంటాయి. లేస్ వంటి వాటి పై ఈ జిగ్ జాగ్ లైన్స్ మీకు కనపడతాయి.

అయితే ఎందుకు ఈ గీతలు ఉంటాయి..? ఈ గీతలు ఎందుకు ఉండాలి కారణం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం… అయితే ఇది కేవలం డిజైన్ అని అనుకుంటే పొరపాటే. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. అదేంటంటే మొదట్లో బంగాళదుంప చిప్స్ ని దేశీయంగా తయారు చేశారు ఆ సమయంలో ఇటువంటి గీతలు ఏమి కూడా చిప్స్ మీద లేవు.

Ads

ఎటువంటి గీతలు లేకుండానే ప్లెయిన్ గానే ఉండేవి. అయితే చిప్స్ పై లైన్స్ ఉండడం వలన చిప్స్ మరింత రుచికరంగా మారతాయి. అదేంటి గీతల వలన రుచి ఏంటి అని ఆశ్చర్యపోకండి మామూలుగా చిప్స్ ఫ్లాట్ గా ఉన్నట్లయితే మసాలాలు పట్టవు. దాంతో రుచి బాగోదు. కానీ గీతలు ఉండడం వలన గీతలకి మసాలా పట్టుకుని ఉంటుంది దాంతో చిప్స్ రుచి బాగుంటుంది.

చిప్స్ పై గీతలు ఉండడం వలన చిప్స్ క్రైస్ప్ గా కూడా ఉంటాయి అదే ఒకవేళ చిప్స్ మీద గీతలు కనుక లేకపోతే చిప్స్ రుచి అంత బాగోదు మసాలాలు వంటివి పట్టుకుని ఉండవు కాబట్టి రుచి బాగా మారుతుంది. కొన్ని చిప్స్ అయితే చప్పగా ఉంటాయి కానీ ఈ లైన్స్ ఉండడం వలన మసాలాలు చిప్స్ కి బాగా పట్టుకుంటాయి. దాంతో టేస్టీగా ఉంటాయి. అందుకనే పొటాటో చిప్స్ వంటి వాటికి పైన గీతలు ఉంటాయి. గీతలు ఉండడం వలన ప్యాకెట్ రుచి అలానే ఉంటుంది ఏమాత్రం తగ్గదు, పోదు.

Previous articleఆర్మీ సైనికులు జుట్టుని ఎందుకు కత్తిరించుకోవాలి..? కారణం ఏమిటి..?
Next articleసునిశిత్ ని చితకబాది.. చరణ్ ఫ్యాన్స్ ఖర్చులకు డబ్బులు ఇచ్చారు..!