Ads
ఇటీవల కాలంలో కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిత్య జీవితంలో అందరికీ ఎదురయ్యే సాధారణ సమస్యలను ప్రధానంగా తీసుకుంటూ తెరకెక్కిన పలు చిత్రాలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటివి ఎక్కువగా మలయాళ సినిమాలలో కనిపిస్తుంటాయి.
Ads
ఇలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన కోలీవుడ్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘జెర‍్సీ’ నటుడు హరీష్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ పేరు పార్కింగ్. ఇలాంటి సమస్యతో తీసిన ఈ ఎలా మూవీ ఉందో ఇప్పుడు చూద్దాం..
పార్కింగ్ సమస్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో హరీష్ కళ్యాణ్, ఇందూజ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించారు. డిసెంబర్ 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, కొత్తగా పెళ్లయిన జంట ఈశ్వర్ (హరీష్ కళ్యాణ్) మరియు అధిక (ఇంధుజ). వీరు కొత్త ఇంట్లోకి అద్దెకు దిగుతారు.
వారి కింద అంతస్తులో ప్రభుత్వ అధికారి ఇలంపరుతి (ఎంఎస్ భాస్కర్), అతని భార్య రాసెల్వి (రామ రాజేంద్ర), కుమార్తె అబర్ణ (ప్రార్థన నాథన్) పదేళ్ళ నుండి అద్దెకు ఉంటారు. ఈశ్వర్ ఒక సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా పనిచేస్తుంటారు. అతని భార్య అధిక గర్భవతి కావడంతో ఆమెకు ప్రయాణంలో ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో ఈశ్వర్ ఒక కారును కొనుగోలు చేస్తాడు. ఇంటి ముందు కారు పార్క్ చేయడంతో, ఇల్లంపరుతి అందుకు అభ్యంతరం చెప్పడం మొదలుపెడతాడు. దాంతో ఈశ్వర్ కు ఇల్లంపరుతికి మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది.
పదేళ్ళ నుండి తను ఉపయోగిస్తున్న పార్కింగ్ స్థలాన్ని ఈశ్వర్ కోసం చేజార్చుకోవడానికి అతనికి ఇగో అడ్డు వస్తుంది. పార్కింగ్ విషయంలో ఈశ్వర్, ఇల్లంపరుతి గొడవలు ఎక్కడికి దారి తీసాయి. చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ. పార్కింగ్ లాంటి చిన్న సమస్యకు అహంకారానికి, ప్రతికారనికి వెళ్తే ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనే విషయాన్ని దర్శకుడు ఈ మూవీలో చూపించాడు.
Also Read: సుడిగాలి సుధీర్ నటించిన “కాలింగ్ సహస్ర” ఎలా ఉందంటే..?