శుక్రవారం నాడే సినిమాలని ఎందుకు ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటారు..? కారణం ఇదే..!

Ads

సినిమాలని ఎక్కువగా శుక్రవారం నాడు రిలీజ్ చేస్తుంటారు, కొత్త సినిమాలు అన్నీ కూడా ఇంచుమించుగా శుక్రవారం నాడే రిలీజ్ అవుతూ ఉంటాయి. థియేటర్లలోనే కాదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా శుక్రవారం నాడు సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటారు. శుక్రవారం నాడే ఎందుకు కొత్త సినిమాలుని రిలీజ్ చేస్తారు…? దాని వెనుక కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారం నాడు సినిమాలని రిలీజ్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి.

మొదటి కారణం ఏంటంటే శుక్రవారం నాడు సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే శనివారం ఆదివారం చాలా మందికి సెలవు కనుక కొత్త సినిమాలను చూడడానికి వెళ్తారు అందుకని ఎక్కువగా శుక్రవారం నాడే సినిమాలని రిలీజ్ చేస్తారు. వీకెండ్ ఉండడంతో ఎక్కువ మంది థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తారు. అందుకని ముఖ్యంగా శుక్రవారం నాడు సినిమాలనే రిలీజ్ చేస్తూ ఉంటారు.

Ads

శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉంటాము. శుక్రవారం నాడు రిలీజ్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి అని కూడా సెంటిమెంట్ ఉంటుంది. అందుకే శుక్రవారం నాడు మూవీస్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇంకో కారణం ఏమిటంటే ఇప్పుడంటే ప్రతి ఒక్కరికి నెలకి ఒకసారి జీతం ఇస్తున్నారు. కానీ ఇదివరకు వారానికి డబ్బులు ఇచ్చేవారు అది కూడా శుక్రవారం నాడు జీతాన్ని ఇచ్చేవారు. శుక్రవారం నాడు సినిమాని రిలీజ్ చేస్తే అప్పుడు జీతం డబ్బులు ఉంటాయి.

కాబట్టి ప్రతి ఒక్కరూ సినిమాని చూడడానికి వస్తారు అని శుక్రవారం నాడు స్పెసిఫిక్ గా సినిమాని రిలీజ్ చేసేవారు. ఈరోజుల్లో అంటే ఇంటర్నెట్ రావడంతో చాలామంది ఫోన్ లో సినిమాలు చూసుకోవడం లేకపోతే టీవీలో చూడడం వంటివి చేస్తున్నారు కానీ ఇదివరకు ఎక్కువ మంది థియేటర్ కి వెళ్లి సినిమాని చూసేవారు. ఇలా ఈ కారణాల వలన శుక్రారం నాడు మూవీస్ ని రిలీజ్ చేస్తూ వుంటారు.

Previous articleబట్టతల ఎందుకు మగవారికి వస్తుంది..? ఆడవాళ్ళకి ఎందుకు రాదు..?
Next articleచెఫ్స్ ఎందుకు పొడవాటి హ్యాట్స్ ని ధరిస్తారు.. కారణం ఏమిటి అంటే..?