అంబేడ్కర్ విగ్రహాలు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?

Ads

చిన్నతనంలోనే అంబేడ్కర్ ఎన్నో అవమానాలని ఎదుర్కొని ఎంతో కష్టపడి చదువుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త. అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదట కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎంపికయ్యారు. అంబేడ్కర్ రాజ్యాంగ శిల్పి కూడా. కొలంబియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డి చేశారు. లండన్ విశ్వవిద్యాలయం నుండి డీఎస్సీ పట్టాని పొంది అరుదైన గౌరవాన్ని సంపాదించారు అంబేడ్కర్.

1990లో భారత ప్రభుత్వం భారతరత్న ని అంబేడ్కర్ కి ఆయన మరణం తర్వాత ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు అంబేడ్కర్. ఏటా ఆయన పుట్టినరోజు నాడు అంబేద్కర్ జయంతిగా జరుపుతారు. అంబేడ్కర్ చేసిన సేవ కి గాను ఆయన విగ్రహాలని కూడా చాలా ఊర్లలో వీధుల్లో పెడుతూ వుంటారు.

Ads

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 132వ జయంతి వేడుకలని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది ఇది. అయితే అంబేడ్కర్ విగ్రహాలని మనం గమనించినట్లయితే ఒక చేత్తో భారత రాజ్యాంగాన్ని పట్టుకుని ఉంటారు. మరొక చెయ్యి ముందుకు సాగమని నిర్దేశిస్తున్నట్లు ఉంటుంది. కానీ విగ్రహాలన్నీ కూడా బ్లూ కలర్ లోనే ఉంటాయి. బ్లూ కలర్ లోనే ఎందుకు కనబడుతూ ఉంటారు..? కారణం చూద్దాం.

బ్లూ కలర్ అంటే ఆయనకీ ఇష్టం. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సార్లు ఈ రంగుని ఉపయోగించారు. ఆకాశం నీలి రంగులో ఉంటుంది. విశాలమైన వాతావరణాన్ని ఆయన కోరుకుంటారట. అలానే ఆయన స్థాపించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి కూడా బ్లూ కలర్ జెండానే ఉపయోగించారు. ఈ కారణంగానే అంబేడ్కర్ విగ్రహాలు బ్లూ కలర్ కోట్ వేసుకున్నట్లు ఉంటాయి. తాజాగా బదౌన్ లో ఆరెంజ్ రంగు జాకెట్ తో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. తర్వాత దానిని మళ్లీ నీలం రంగులోకి పెయింట్ వేసి మార్చేశారు.

Previous articleపార్లమెంట్ లో సభ్యులు హెడ్ ఫోన్స్ ఎందుకు ఉపయోగిస్తారు..? దాని వెనుక కారణం ఏమిటి అంటే..?
Next articleరైలు భోగిలో “డోర్” కి పక్కన ఉండే “కిటికీలకు” ఎక్కువ “ఊచలు” ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?