డీమర్ట్ లో సామాన్లని మనకి తక్కువ ధరకే ఎందుకు ఇస్తారు..?

Ads

ఇప్పటికే చాలా డీమార్ట్ లు వచ్చేసాయి. ఏ డీమర్ట్ లో అయినా జనం ఎక్కువగా వుంటారు. పైగా ఎన్నో రకాల వస్తువులను డీమార్ట్ లోకి తీసుకొస్తూ ఉంటారు ఆఫర్లను కూడా పెడుతూ ఉంటారు. డీమార్ట్ కి జనం ఎందుకు ఎక్కువగా వెళ్తారు అంటే డబ్బులు ని ఆదా చేసుకోవచ్చు అని.. డీమార్ట్ లో మనకి కావాల్సిన సరుకులు తక్కువ ధరకే లభిస్తాయి బయట కంటే కూడా డీమార్ట్ లో షాపింగ్ చేయడం వలన తక్కువ ధరకే మనం షాపింగ్ చేయొచ్చు.

అందుకనే చాలామంది డిమార్ట్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రోజువారి సామాన్లు నుండి అవసరమయ్యే అన్నీకూడా డీమార్ట్ లో కొనుగోలు చేస్తూ ఉంటారు. చాలా మంది నెలకి సరిపడా సామాన్లని డిమార్ట్ కి వెళ్లి తెచ్చుకుంటారు. అయితే ఎందుకు డీమార్ట్ లో తక్కువ ధరకే మనకి సామాన్లు లభిస్తాయి..?

డీమార్ట్ లు ఎందుకు తక్కువ ధరకే మనకి వీటిని అందిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బయట చూస్తే మనకి తక్కువ ధరకు రావు ఇక్కడ చూస్తే డిస్కౌంట్ ఎక్కువ ఉంటుంది. మరి దానికి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

  • డీమార్ట్ ని ఒక ప్లేస్ తీసుకుని అక్కడ కడతారు. మామూలుగా ఏదైనా షాప్ ని చూసినట్లయితే
    దాన్ని వాళ్ళు రెంట్ కి తీసుకుని అక్కడ ప్రొడక్ట్స్ ని అమ్ముతూ ఉంటారు. కానీ డీమార్ట్ అలా కాదు. అద్దెకి తీసుకొని ఉంటే ఎక్కువ రెంట్ ని కట్టాల్సి ఉంటుంది.
  • అలానే డీమార్ట్ ని ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ లొకేషన్ లో పెడతారు ఎక్కువ జనం ఉండే చోట ఈ డిమార్ట్ లని పెడుతూ ఉంటారు. రైల్వే స్టేషన్ల దగ్గర రెసిడెన్షియల్ కాంప్లెక్స్ దగ్గర ఎక్కువ పెడతారు.

  • డీమార్ట్ లో ప్రొడక్ట్స్ ని బల్క్ లో తీసుకుంటూ ఉంటారు. వేల కిలోల సరుకులని ఒకసారే తీసుకుంటారు దాంతో తక్కువ ధరకి వాళ్ళకి వస్తాయి. బల్క్ లో తీసుకుంటే తక్కువ ధరకే వస్తాయి కాబట్టి ఎక్కువ డిస్కౌంట్ మనకి ఇస్తారు.
  • ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా వీళ్ళకి తక్కువగానే ఉంటుంది ఈ కారణాల వలన డీమార్ట్ లో ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది.
Previous article100 రోజులు పూర్తి చేసుకున్న బట్టి విక్రమార్క పాదయాత్ర ! తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం !
Next articleఏదైనా వస్తువుని కానీ ఎవరినైనా కానీ ముట్టుకుంటే.. అప్పుడప్పుడు ఎందుకు షాక్ కొడుతోంది..?