ఏదైనా వస్తువుని కానీ ఎవరినైనా కానీ ముట్టుకుంటే.. అప్పుడప్పుడు ఎందుకు షాక్ కొడుతోంది..?

Ads

అప్పుడప్పుడు మనం ఏదైనా వస్తువుని ముట్టుకున్నప్పుడు కానీ లేదంటే ఎవరినైనా ముట్టుకున్నప్పుడు కానీ షాక్ కొట్టినట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది. నిజంగా షాక్ కొట్టిందా లేదంటే మన ఊహా అని కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది. అయితే నిజానికి ఏదైనా వస్తువుని ముట్టుకున్నప్పుడు కానీ ఎవరినైనా ముట్టుకున్నప్పుడు కానీ చిన్నగా షాక్ కొట్టడం నిజమే దాని వెనుక ఒక పెద్ద కారణం ఉంది. అదేంటో ఇప్పుడే తెలుసుకుందాం. దీనినే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని పిలుస్తారు.

స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వలనే ఇలా జరుగుతుంది. మన చుట్టూ ఉండే అన్నీ కూడా ఆటమ్స్ (atoms) ద్వారా రూపొందించబడతాయి. ఈ ఆటమ్స్ లో ఎలక్ట్రాన్స్, ప్రోటోన్స్ ఉంటాయి. ప్రోటోన్స్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ తో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ తో ఉంటాయి. న్యూట్రాన్స్ కి ఎలాంటి ఛార్జ్ కూడా ఉండదు. సాధారణంగా ఏదైనా ఆబ్జెక్ట్ లో ప్రోటోన్స్ ఎలక్ట్రాన్స్ సరైన సంఖ్యలో ఉంటాయి.

Ads

ఒకవేళ కనుక ఆ రెండు ఒకే సంఖ్యలో లేవు అంటే ఎలక్ట్రాన్స్ బౌన్స్ అవుతూ ఉంటాయి. అలా ఉండే ఆబ్జెక్ట్ ని వస్తువుల కానీ లేదంటే మనుషులు ని కానీ ముట్టుకున్నప్పుడు ఎలెక్ట్రాన్స్ ప్రోటీన్స్ కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి దీనితో ఎలక్ట్రాన్స్ ప్రోటోన్స్ వైపు కదులుతూ ఉంటాయి ఇలా ఇవి వేగంగా కదిలి వెళ్ళినప్పుడు షాక్ కొడుతుంది ఇలా షాక్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా చూద్దాం..

గాలిలో తేమ తక్కువగా ఉన్నప్పుడు ఇలా షాక్ అనేది కొడుతుంది. చలికాలంలో ఎక్కువగా ఇలాంటివి జరుగుతుంటాయి ఎందుకంటే అప్పుడు తేమ తక్కువ ఉంటుంది కనుక. హ్యుమిడిఫైయర్ని ఉపయోగిస్తే ఈ సమస్య ఉండదు. అలానే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా ఎక్కువ షాక్స్ కొడుతూ ఉంటాయి. మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకుంటే ఈ సమస్య ఉండదు. పాలిస్టర్ బట్టలు కాకుండా కాటన్ దుస్తులు వేసుకుంటే కూడా ఈ సమస్య ఉండదు.

Previous articleడీమర్ట్ లో సామాన్లని మనకి తక్కువ ధరకే ఎందుకు ఇస్తారు..?
Next articleమహేందర్ రెడ్డి చూపు ఎటువైపు ?