బట్టతల ఎందుకు మగవారికి వస్తుంది..? ఆడవాళ్ళకి ఎందుకు రాదు..?

Ads

ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో బట్టతల కూడా ఒకటి. ముఖ్యంగా మగవాళ్ళు బట్టతల సమస్య తో బాధ పడుతూ ఉంటారు. ఈరోజుల్లో మూడు పదులు దాటితే పొట్ట, బట్టతల బోనస్ గా వచ్చేస్తున్నాయి. ఈ రెండూ ఉంటే పెళ్లి కూడా ఎవరు చేసుకోరు. బట్టతల రాకుండానే పెళ్లి చేసుకోవాలి. బట్టతల ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఒప్పుకోవడం లేదు. బట్టతల వచ్చేసి మీకు ఇంకా పెళ్లి అవ్వలేదంటే ఇక పెళ్లి సంగతి పక్కన పెట్టేయాల్సిందే అన్నట్టు రోజులు మారిపోయాయి.

అసలు బట్టతల ఎందుకు మగవాళ్లలో వస్తుంది దానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరే జుట్టు రాలిపోతూ ఉంటుంది. మగవాళ్ళకే జుట్టు రాలిపోతుంది ఆడవాళ్ళకి జుట్టు రాలదు. అందుకే వాళ్ళల్లో బట్టతలా వస్తుంది అనుకోవడం పొరపాటు.

Ads

అలానే ఆడవాళ్ళకి చాలా జుట్టు ఉంటుంది. పొడుగ్గా జుట్టు ఎదిగిపోతుంది అందుకే వాళ్ళల్లో బట్టతల రాదు అనుకుంటే పప్పు లో కాలు వేసినట్టు. ఆడవాళ్ళకి కూడా జుట్టు విపరీతంగా రాలుతూ ఉంటుంది. పోషకాహార లోపం వలన థైరాయిడ్, హార్మోన్స్ లో హెచ్చుతగ్గులు రావడం, జెనెటిక్స్, వయసు ఈ కారణాల వలన జుట్టు ఎవరిలో అయినా రావచ్చు. కానీ బట్టతల మాత్రం మగవాళ్ళకే వస్తుంది. ఆడవాళ్ళకి బట్టతల రాదు. దానికి కారణం మగవాళ్లలో ఉండే టెస్టోస్టెరీన్.

టెస్టోస్టెరీన్ ఏ మగవారిలో బట్టతల రావడానికి ముఖ్య కారణమ్. ఈ టెస్టోస్టెరీన్ లో కొన్ని డీహైడ్రోటెస్టోస్టెరీన్ కింద మారిపోతాయి దీని కారణంగా జుట్టు ఎదుగుదలని ఆగిపోతుంది. జుట్టు ఎదుగుదలకు అంతరాయం కలుగుతుంది. జుట్టు సన్నగా అయిపోతుంది రాలిపోతుంది. అవి చాలా ఈజీగా బ్రేక్ అయిపోతాయి మళ్ళీ ఎదగడం కి అవ్వదు. ఈ కారణంగానే మగవాళ్లలో బట్టతల వస్తుంది.

Previous articleVirupaksha Movie Heroine Samyuktha Menon Age, Biography, Movies, Family Details
Next articleశుక్రవారం నాడే సినిమాలని ఎందుకు ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటారు..? కారణం ఇదే..!