పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అబ్బాయి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.?

Ads

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది చాలా ముఖ్యమైనది. అయితే ఎలా అయితే ప్రతి దానిలోను కష్టం సుఖం ఉంటాయో… వైవాహిక జీవితంలో కూడా అలానే కష్ట సుఖాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎనలేని ఆనందం కలిగితే ఒక్కొక్కసారి కృంగిపోయే బాధ మనకి కలుగుతూ ఉంటుంది. వివాహం తర్వాత భార్య భర్తలు ఇద్దరూ ఆనందంగా సాఫీగా వారి జీవితం ఉండేటట్టు చూసుకోవాలి.

చిన్న చిన్న గొడవలతో సర్దుకుపోతూ ఉంటే సంసార జీవితంలో ఎలాంటి బాధలు కలగవు. కనుక పదే పదే ఇబ్బందులు రాకుండా చూసుకోండి.

ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ..ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చి జీవితంలో ముందుకు వెళితే కచ్చితంగా వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రావు. అయితే వివాహం చేసుకునేటప్పుడు భార్య భర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలి..? చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. ఎక్కువ వయసు తేడా ఉండాలా లేదంటే రెండు మూడేళ్లు ఉంటే సరిపోతుందా అని.. కానీ నిజానికి యువతి యువకుల మధ్య ఏజ్ గ్యాప్ అయితే మాత్రం కచ్చితంగా ఉండాలి. చాలామంది అలానే అనుసరిస్తున్నారు. ఏజ్ గ్యాప్ ని చూసుకొని తర్వాత పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఎవరిష్టం వారిది.

Ads

కొంత మంది రెండు నుండే మూడేళ్లు వయసు తేడా ఉన్న వారిని చేసుకుంటే కొంత మంది మాత్రం సేమ్ ఈజ్ వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. నిపుణులు మాత్రం కచ్చితంగా ఏజ్ గ్యాప్ ఉండాలని అంటున్నారు. భార్యాభర్తల మధ్య ఐదేళ్ల నుండి ఏడేళ్ల వరకు గ్యాప్ ఉంటే వారి జీవితం బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని.. ఆనందంగా వుండచ్చని చెప్తున్నారు. మెచ్యూరిటీగా ఆలోచించడానికి అవుతుంది. దానితో గొడవలు కూడా రావు సర్దుకుపోతారు. పదేళ్ల వయసు తేడా ఉన్నట్లయితే వారి మధ్య ఇబ్బందులు ఎక్కువగా రావచ్చు అని నిపుణులు అంటున్నారు విడిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అదే 20 ఏళ్లు లేదంటే 15 ఏళ్లు వయస్సు తేడా ఉంటే వాళ్లు పెళ్లి చేసుకోవడమే వృధా అని నిపుణులు చెప్తున్నారు.

Also Read: ఆడవాళ్లు పెళ్లయ్యాక బరువు ఎందుకు పెరుగుతారు..? కారణం ఇదే..!

Previous article72 ఏళ్ల రజనీకాంత్ 50 ఏళ్ల సీఎం యోగి కి కాళ్లకు మొక్కాల్సిన అవసరం ఏమిటి.? కారణం ఇదేనా.?
Next articleస్టార్ డైరెక్టర్లు “ప్రభాస్” డేట్స్ కోసం ఎదురుచూస్తుంటే…”ప్రభాస్” మాత్రం ఆ హీరోయిన్ డేట్స్ కోసం చూస్తున్నారంట.?