విమానం లో వెళ్ళేటప్పుడు.. ఫోన్ ని ఎందుకు ”ఫ్లైట్ మోడ్” లో పెట్టాలి..?

Ads

ఎక్కడికైనా వెళ్లాలంటే ఫ్లైట్ లో వెళితే ఎంతో ఈజీగా ఉంటుంది. మనం తక్కువ టైంలో ట్రావెల్ చేయొచ్చు. అలసట ఉండదు. రిలాక్స్ గా తక్కువ సమయంలో అనుకున్న చోటికి వెళ్లచ్చు. అదే మనం బస్సుల్లో కానీ ట్రైన్ లో కానీ వెళితే అలసట ఉంటుంది. పైగా ఎక్కువ సమయం పడుతుంది. టైం వేస్ట్ అవుతుంది కూడా. అయితే ఫ్లైట్లో వెళ్లినప్పుడు మన ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టమని అంటారు. అయితే ఎందుకు మనం ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఏరోప్లేన్ మోడ్ లో పెట్టాలి..? దాని వెనుక కారణం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

మనం ఫ్లైట్లో ట్రావెల్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ ఫ్లైట్ మోడ్ లో ఉంచడం కానీ చేస్తాము. ఎందుకు అలా చేయాలి అనే దాని వెనుక కారణం మీకు తెలుసా…? ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

మామూలుగా మొబైల్ టవర్ మధ్య సిగ్నల్ ప్రసారం ఉంటుంది. విమాన ప్రయాణంలో కూడా ఈ రేడియో సిగ్నల్స్ ఉంటాయి. కనుక మనం ఫ్లైట్లో వెళ్లినప్పుడు ఫ్లైట్ మోడ్ లో పెట్టడం కానీ స్విచ్ ఆఫ్ చేయడం కానీ మంచిది. ఇలా చేశాక సిగ్నల్ ప్రసారం ఆగుతుంది. చాలా ఎయిర్ లైన్స్ ఈ రేడియో సిగ్నల్ లో ఉనికి సెన్సార్లని, నావిగేషన్ లేదంటే విమానంలోని పరికరాలని ప్రభావితం చేస్తుందని అంటారు. కనుక ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో ఉంచడం మంచిది.

ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడూ రాడార్ కంట్రోల్ రూమ్ తో టచ్ లో ఉంటారు రేడియో స్టేషన్ తో టచ్ లో ఉంటేనే దాన్ని ట్రాక్ చేయగలదు. లేకపోతే పక్కదారి పట్టే ఛాన్స్ ఉంది. ఫ్లైట్ మోడ్ లో ఫోన్ ఉంచకపోతే కంట్రోల్ స్టేషన్ కి పైలెట్ తో కమ్యూనికేషన్ చేయడం కష్టంగా మారుతుంది. విమానం దారి తప్పుతుంది. లేకపోతే క్రాష్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అందుకని ఫ్లైట్ మోడ్ లో పెట్టడం లేకపోతే స్విచ్ ఆఫ్ చేయడం మంచిది.

Previous articleహీరో చనిపోయినా హిట్ అయిన సినిమాలు ఇవే..!
Next articleరాహుల్ నిర్వహించిన జోడో యాత్ర స్పూర్తిగా భట్టి విక్రమార్క్ ప్రజలతో మమేకం అవుతూ తన పీపుల్స్ మార్చ్ యాత్ర