రాత్రిపూట గోర్లు కట్ చేయకూడదని పెద్దలు అంటారు… కారణం ఏమిటో తెలుసా..?

Ads

మనం ఏమైనా పనులు చేసినప్పుడు అది ఇప్పుడు చేయకూడదని అని ఇలా చెయ్యకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది మనకి విసుకుగా ఉంటుంది. ఎందుకు ఇలా అంటారు..? ప్రతీ దానికి ఏదోఒకటి చెప్తూ వుంటారు అని మనకి అనిపిస్తుంది. ఇంట్లో రాత్రిపూట తల దువ్వుకోకూడదని రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోకూడదని చెప్తూ ఉంటారు. మీరు కూడా ఈ విషయాన్ని విన్నారా…? మన పెద్దలు రాత్రి పూట గోర్లు కత్తిరించుకోకూడదని చెప్తూ ఉంటారు రాత్రి వేళ లో గోర్లను ఎందుకు కత్తిరించుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

దాని వెనుక రెండు కారణాలు వున్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డేర్మటాలజీ అసోసియేషన్ ప్రకారం మన గోళ్ళ లో కెరాటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది.

Ads

గోళ్ళని కత్తిరించడానికి మంచి సమయం స్నానం చేశాకనే. స్నానం చేసిన వెంటనే గోళ్ళ ని కత్తిరించడం మంచిది అని అందరూ భావిస్తూ ఉంటారు. ఎందుకు అంటే తేలికగా గోళ్ళని స్నానం చేశాక కత్తిరించుకో వచ్చు. రాత్రి పూట గోళ్లు గట్టిగా ఉంటాయి కత్తిరించడం కష్టంగా ఉంటుంది తేమ ఉండదు. అలాంటప్పుడు గోళ్ళని కత్తిరిస్తే నొప్పి కలుగుతుంది. ఇంకొక కారణం ఏంటంటే రాత్రి పూట అప్పట్లో కరెంటు ఉండేది కాదు. అలాంటప్పుడు గోళ్లు ఎక్కడ పడితే అక్కడ పడుతూ ఉంటాయి తినే ఆహారంలో కూడా పడొచ్చు.

అలానే అప్పట్లో నెయిల్ కట్టర్స్ కూడా ఉండేవి కాదు దాంతో కత్తి తో గాని పదునైన వాటితో కానీ గోళ్లు ని కత్తిరించేవారు అది ప్రమాదం. చీకట్లో ఆ పదునైన వాటి వలన ప్రమాదం కలగొచ్చు. ఈ కారణంగానే అప్పట్లో పెద్దలు రాత్రి పూట వద్దని చెప్పేవారు. గోళ్ళని కత్తిరించాలంటే ముందు గోళ్లు తడిగా ఉండేటట్టు చూసుకోండి. నీళ్లు లేదా నూనెలో నానబెట్టి ఆ తర్వాత కట్ చేస్తే గోర్లు మృదువుగా మారుతాయి. గోళ్ళని కట్ చేసుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

Previous articleచీకటి పడ్డాక ఇల్లు ఊడిస్తే లక్ష్మీ దేవి ఇంట్లో అని…రాత్రిపూట గోర్లని కత్తిరించకూడదు అని అంటారు .దాని వెనుక కారణం ఇదే
Next articleరామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా కంటే ముందు RRR కోసం రాజమౌళి ఎంచుకున్న హీరోలు వీరేనా ?