త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు… కానీ అంతలోనే బ్రేకప్ ప్రకటించిన నటి..! కారణం ఏంటి..?

Ads

జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు. ఎంతో మందికి ఈ ప్రోగ్రాం ద్వారా పాపులారిటీ లభించింది. వారిలో పవిత్ర ఒకరు. కొంత కాలం క్రితం జబర్దస్త్ లోకి వచ్చిన పవిత్ర, తన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పవిత్ర సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

అంతే కాకుండా యూట్యూబ్ లో పాగల్ పవిత్ర పేరుతో ఛానల్ కూడా మొదలు పెట్టారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా పవిత్ర సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా ఇటీవల కొంత కాలం క్రితం పవిత్ర తాను ప్రేమలో ఉన్నట్టు ప్రకటించి, ప్రేమించిన వ్యక్తిని పరిచయం చేశారు.

jabardast pavitra break up

అతని పేరు సంతోష్ అని చెప్పారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అని కూడా అన్నారు. దాంతో అందరూ కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. అయితే నిన్న, అంటే ఫిబ్రవరి 14వ తేదీన పవిత్ర తన సోషల్ మీడియా వేదికగానే వారిద్దరు విడిపోతున్నట్టు ప్రకటించారు. ఒక పోస్ట్ చేసి, అందులో వాళ్ళు ఇద్దరు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు, ఇద్దరి దారులకి గౌరవాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులకు, సన్నిహితులకి, ఇలాంటి సమయంలో కాస్త ప్రైవసీ ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేశారు.

Ads

jabardast pavitra break up

ఈ పోస్ట్ కి కామెంట్స్ కూడా ఆఫ్ చేశారు. ఎంగేజ్మెంట్ వరకు వెళ్లిన ప్రేమ ఆగిపోవడంతో చాలా మంది పవిత్రకి ధైర్యం చెప్తూ ఇతర మాధ్యమాల ద్వారా పోస్ట్ చేశారు. అయితే పవిత్ర కొన్ని గంటల క్రితం మరొక ఫోటో షేర్ చేశారు. అందులో పవిత్రతో పాటు, బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య, హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సాయి రాజేష్ ఉన్నారు. “మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని క్యాప్షన్ తో పవిత్ర ఈ పోస్ట్ షేర్ చేశారు.

jabardast pavitra break up

యూట్యూబ్ లో పవిత్ర వీడియోస్ కూడా షేర్ చేస్తూనే ఉన్నారు. తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఇంకొక నటి ఐశ్వర్యతో వీడియో కాల్ మాట్లాడుతున్న స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశారు. అంతే కాకుండా నిన్న ఒక పార్టీకి వెళ్లినట్టు, అందుకు సంబంధించిన ఫోటోలని కూడా పవిత్ర షేర్ చేశారు. అయితే వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటి అని కామెంట్ చేయడం మొదలు పెట్టారు. కానీ కొంత మంది మాత్రం వారి ప్రైవసీ గౌరవాన్ని ఇచ్చి, ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

ALSO READ : “సైడ్ క్యారెక్టర్” నుంచి… “హ్యాట్రిక్ హీరో” గా మారిన జోష్ సినిమా ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?

Previous articleభూమిలో ”గుప్త నిధులు” ఎవరికి సొంతం..? వాటిని ఏ విధంగా పంచుతారు..?
Next articleఓయ్ సినిమా రీ-రిలీజ్ సందడి అంతా ఒక ఎత్తు… ఈ అమ్మాయి డాన్స్ మరొక ఎత్తు..! ఈమె ఎవరో తెలుసా..?