అది ట్రైన్ అనుకున్నారా లేదా.? ఫుల్లు స్పీడుతో బ్రిడ్జి పై ట్రైన్ వస్తుంటే ఆ ముగ్గురు యువకులు..చివరకు.?

Ads

సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ లో అప్లోడ్ అయ్యే వీడియోల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇలా అప్లోడ్ అయ్యే వీడియోలలో చాలావరకు ఫన్నీగా ఉండే వీడియోస్ ఉంటే ..మరికొన్ని ఆసక్తికరంగా ఉండడమే కాకుండా, ఎమోషనల్ గా కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో నేటిజెన్లు తమని ఆకట్టుకున్న వీడియోస్ ను బాగా వైరల్ చేస్తున్నారు. ఇలా వైరల్ అయిన ఒక వీడియో చూసిన వాళ్ళని షాక్ కి గురిచేస్తుంది.

ఆ వీడియో ఏమిటి అంటే…ఒక ముగ్గురు కుర్రాళ్ళు చేసిన సాహసం చూసేవారికి విపరీతమైన కోపం తెప్పించే విధంగా ఉంది. రాజస్థాన్ లో చిత్రీకరించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రయాణికులతో నిండు గర్భిణీలా నిండి ఉన్న ఒక ట్రైన్ కొండల మధ్య నుంచి వేగంగా ప్రయాణిస్తుంది. ప్రయాణికులు ట్రైన్లో ఉన్న స్థలం చాలదు అన్నట్లు భోగిలపైన ,కంపార్ట్మెంట్ మెట్ల పైన కూడా కూర్చొని ఉన్నారు. ఇక ఏ ట్రైన్ ని బ్రిడ్జి మీదకు వస్తున్న సమయంలో ముగ్గురు కుర్రాళ్ళు వీడియో తీస్తున్నారు.

watch video:

ఇందులో వింత ఏమిటి అనుకుంటున్నారా…ఆ బ్రిడ్జిపై ట్రైన్ వచ్చే సమయానికి అటు ఇటు కదలడానికి కూడా చోటు లేదు. సరిగ్గా ట్రైన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ముగ్గురిలో ఒక కుర్రాడు భయపడి ముందుగా కిందకి దూకేశాడు. మరొక కుర్రాడు ట్రైన్ తగలడంతో కింద పడిపోయాడు. ఇప్పటికే ఈ వీడియోకి 6.6 లక్షల వ్యూస్ వచ్చాయి.

అయితే చాలామంది ఈ వీడియో గురించి ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో రాజస్థాన్లోని గోరం ఘాట్ అనే ప్రదేశంలో చిత్రీకరించడం జరిగింది. ప్రకృతి ఆహ్లాదాలకు ఆనవాలుగా ఉన్న ఈ ప్రదేశంలో కొండలకు, లోయలకు కొదువ లేదు. అయితే ఈ ముగ్గురు తీసిన వీడియో మాత్రం.. సరి అయినది కాదు అని వ్యూవర్స్ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో లైక్ లు , వ్యూస్ తెప్పించుకోవడం కోసం.. కొందరు ఇటువంటి వెర్రి పనులు చేయడం మంచిది కాదు అని అడ్వైస్ కూడా ఇస్తున్నారు.

Previous articleCHANDRAMUKHI 2 REVIEW:రజనీ ఇంపాక్ట్ ను చంద్రముఖి 2 మూవీ లో లారెన్స్ తట్టుకోగలిగాడా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్!!!
Next article2014 నుండి ప్రతి వరల్డ్ కప్‌లో ఇండియాకి ఇదే బలహీనత… ఈసారి అయినా అధిగమిస్తారా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.