ఇంటిని శుభ్రం చేస్తుంటే.. బయటపడ్డ లవ్ లెటర్.. 18 ఏళ్ల క్రితం తన భర్త..

Ads

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మనకి కొన్ని విచిత్రమైన విషయాలు కనబడుతూ ఉంటాయి. ప్రేమికులు రాసుకున్న ఉత్తరాల మొదలు పాత శుభలేఖలు దాకా చాలా కనపడతాయి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వారి యొక్క ప్రేమని మెసేజ్ ద్వారా చెప్తున్నారు. కానీ ఇది వరకు ఫోన్లే ఉండేవి కాదు. అప్పటి వాళ్ళు ఉత్తరాలు రాసుకునేవారు. ప్రేమ ని లేఖలు ద్వారా ప్రేయసికి ప్రియుడు ప్రియుడికి ప్రేయసి రాసుకునేవారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ ప్రేమ లేఖ నెక్స్ట్ లెవెల్. ఇంటిని శుభ్రం చేస్తూ వున్న భార్య కి తన భర్త రాసిన ప్రేమ లేఖ కనపడింది.

18 ఏళ్ల క్రితం తన భర్త ఆమె కి ప్రేమ లేఖని రాశారు ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒక మహిళ తన ఇంటిని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు పాడైపోయిన వస్తువులు అన్నింటినీ తీసి బయట పడేస్తున్నప్పుడు ఈ లవ్ లెటర్ కనపడింది. 18 ఏళ్ల క్రితం తన భర్త రాసిన ప్రేమలేఖ అది అని తెలుస్తోంది.

Ads

ప్రేమను తెలుపుతూ ప్రియురాలకి ల్యాబ్ ఎక్స్పరిమెంట్ ల గురించి డ్రాయింగ్ ల గురించి కూడా ఆయన రాశారు. చదువుకు సంబంధించిన చాలా విషయాలు వివరించారు కూడా. నిజానికి నేను ఇంతలా ప్రేమిస్తున్నాను అంతలా ప్రేమిస్తున్నాను అని.. నీ కోసం అది కొంటాను ఇది కొంటాను వంటి సుత్తి కబుర్లు చెప్పే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కానీ ప్రేమ లేఖ లో ఇలా చదువు గురించి ప్రస్తావించేవారు అరుదుగా ఉంటారు.

ఈ లేఖ లో చూసుకున్నట్లయితే తన భర్త ల్యాబ్ ఎక్స్పరిమెంట్ల గురించి అలానే చదువుకి సంబంధించిన కొన్ని విషయాలు గురించి రాశారు. ఆయన పేరు అయ్యర్. తన భార్య కి కొన్ని డయాగ్రములు వేశారు ఈ లేఖలో అలానే ఇంగ్లీషులో కొంచెం సబ్జెక్ట్ కి సంబంధించిన విషయాలని రాసుకోచ్చారు. మామూలుగా ప్రేమలేఖలు రాసే వాళ్ళు ఉంటారు కానీ ఇలా రాసే వాళ్ళు రేర్ కదా..?

Previous articleఎంపైర్ చేతులో ఈ గాడ్జెట్ ఎందుకు ఉంటుంది..? దాని వెనుక రీజన్ ఏమిటి అంటే..?
Next articleహీరో చనిపోయినా హిట్ అయిన సినిమాలు ఇవే..!